Kriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదే

Kriti Shetty Maname: ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో.. ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. వరుసగా ఒకదాని తర్వాత మరొక డిజాస్టర్.. అందుకుంటున్న.. కృతి శెట్టి తన ఆశలన్నీ.. మనమే సినిమా మీద పెట్టుకుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా కూడా.. కృతి శెట్టి కెరియర్ ని మార్చే విధంగా.. కనిపించడం లేదు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 16, 2024, 07:14 AM IST
Kriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదే

Maname Review: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఉప్పెన సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది.. కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ.. తన అందం, అభినయంతో.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. దీంతో ఈమెకు చాలానే ఆఫర్లు వచ్చిపడ్డాయి. 

ఆ తర్వాత కూడా బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలతో.. వరుస సూపర్ హిట్ లు అందుకుంది. టాలీవుడ్ లో ఆ సమయంలో.. ఈమె పేరు మారుమ్రోగిపోయింది. కచ్చితంగా కృతి శెట్టి.. స్టార్ హీరోయిన్ అయిపోతుంది.. అని అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఈ భామ వరుస డిజాస్టర్ లతో.. ఫ్లాప్ హీరోయిన్ గా మారిపోయింది.

ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ.. ఇలా ఒక సినిమా తర్వాత మరొక సినిమా డిజాస్టర్లుగా.. నిలవడంతో కృతి శెట్టి కెరియర్ ఒక్కసారిగా పడిపోయింది. వరుసగా మూడు సూపర్ హిట్లు అందుకున్న.. కృతి శెట్టి ఇప్పుడు ఒక్క హిట్ కోసం సతమతమవుతోంది. 

తాజాగా కృతి శెట్టి..శర్వానంద్ హీరోగా నటించిన.. మనమే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఆమె మళ్ళీ ట్రాక్ లో పడిపోవచ్చు అని.. కృతి శెట్టీతో పాటు అభిమానులు కూడా అనుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ.. మంచి రివ్యూస్ ని మాత్రం అందుకుంది. దీంతో వారాంతం దాకా కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ సోమవారం నుంచి.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా నెట్టుకు రాలేక కలెక్షన్స్ పరంగా ధీలా పడిపోయింది. 

కనీసం రెండు వారాలు కూడా థియేటర్లలో స్ట్రాంగ్ గా ఉండలేకపోయింది ఈ సినిమా. పైగా ఈ శుక్రవారం ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో మనమే సినిమా కి థియేటర్లు కరువయ్యాయి. అయితే కనీసం ఈ సినిమాకి ప్రమోషన్స్ అన్న చేస్తున్నారా అంటే.. కృతి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని నిర్మాతకు ఆల్రెడీ చెప్పిందట. ఈ సినిమాకి కలెక్షన్స్ తగ్గిపోవడంతో.. తన ప్రసన్స్ ఉన్నా లేకపోయినా ఒకటే అని.. ఒకవేళ ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రస్తుతం తన టైం బాలేదు కాబట్టి.. అవి ఎక్కడ సోషల్ మీడియాలో నెగిటివ్ గా వెళ్తాయో అని.. కృతి ప్రమోషన్స్ కి సైతం దూరంగానే ఉందంట. కాగా ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఈ హీరోయిన్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. మరి ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కాదు అని.. ఈ హీరోయిన్ కి.. ముందే తెలుసు ఏమో అని.. కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నాడు.

ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే..ప్రస్తుతం కృతి శెట్టి తమిళ్ లో చేస్తున్న.. మూడు సినిమాల మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. తెలుగులో ఈమెకు ఆఫర్లు రావడం లేదు కానీ.. తమిళ్లో అయినా మంచి హిట్ లో అందుకుంటే.. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుకునే అవకాశం లేకపోలేదు. 

అయితే కృతి శెట్టి తన సినిమా సెలక్షన్ విషయంలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉందని.. ఇకపై కూడా ఇలాంటి సినిమాల్లోనే నటిస్తే ఆమె ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయే అవకాశాలు ఉన్నాయని.. అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారు. మరి ఇకనైనా కృతి శెట్టి తన కెరియర్ విషయంలో మారి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం

Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News