Xiaomi 14 Price: ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ మార్కెట్లో రోజు రోజుకు మంచి గుర్తింపు సంపాదిస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. అలాగే యువత కోసం అతి తక్కువ ధరల్లోనే ఎక్కువ ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌ను రెడీ చేసి విక్రయిస్తోంది. అంతేకాకుండా అదే పనిగా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది. గతంలో మార్కెట్లోకి లాంచ్ చేసిన Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తోంది. దీని ధర రూ. 69,999 నుంచి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ పొందడానికి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో బిల్ చెల్లిస్తే, ప్రత్యేకమైన కూపన్‌తో రూ. 10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు ఇదే డిస్కౌంట్ పొందవచ్చు.
అంతేకాకుండా అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ పొందడానికి మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.30,800 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Xiaomi 14 మొబైల్‌ను రూ.39,199కే పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, జేడ్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.36-అంగుళాల LTPO OLED డిస్ప్లే
1.5K రిజల్యూషన్ డిస్ప్లే
Snapdragon 8 Gen 3 (4nm) ప్రాసెసర్
90W ఫాస్ట్ ఛార్జింగ్
50W వైర్లెస్ ఛార్జింగ్
IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
50MP మెయిన్ కెమెరా
50MP టెలిఫోటో లెన్స్ కెమెరా
50MP అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్
10W రివర్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
4610mAh కెపాసిటీ బ్యాటరీ
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి