Kriti Shetty: బోలెడన్ని మార్పులు చేసుకుంటున్న స్టార్ హీరోయిన్.. ఇప్పటికన్నా పరిస్థితి మారేనా!

Kriti Shetty Upcoming Movies:సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం.. ఎప్పుడూ ఆకాశానికి ఎత్తుతుందో.. ఎప్పుడు పాతాళంలోకి పడేస్తుందో ఎవరికి తెలియదు. పాపం కృతి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే తయారయింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 14, 2024, 11:16 AM IST
Kriti Shetty: బోలెడన్ని మార్పులు చేసుకుంటున్న స్టార్ హీరోయిన్.. ఇప్పటికన్నా పరిస్థితి మారేనా!

Kriti Shetty Remuneration:సినీ ఇండస్ట్రీలో చాలావరకు హీరోల పందా ఒకే రకంగా ఉంటుంది. కానీ హీరోయిన్‌ల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్క సినిమా హిట్ అయింది అంటే ఆకాశానికి ఎత్తేస్తారు.. వరుస ఆఫర్లతో లక్కీ స్టార్‌ని చేసేస్తారు. వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కానీ అదే హీరోయిన్‌కి ఒకటో రెండో ఫ్లాపులు పడ్డాయనుకోండి.. సీన్ వెంటనే రివర్స్ అయిపోతుంది. సినిమాల్లో ఛాన్స్ల మాట దేవుడెరుగు ఆడియన్స్ కూడా వాళ్ళని చాలా లైట‌గా తీసుకుంటారు. ఐరన్ లెగ్ అని ముద్ర వేసి సినిమాలనుంచి దూరంగా పెట్టేస్తారు.

ప్రస్తుతం కన్నడ బ్యూటీ కృతి శెట్టి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డబ్ల్యూ ఇచ్చిన ఈ బ్యూటీ కుర్ర కారు మది దోచుకుంది. తొలి సినిమా లో తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమా హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె తెలుగులో నటించిన రెండవ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో డిమాండ్ పెరగడంతో పాటు పారితోషకం ఇట్టే రెండు కోట్లు దాటిపోయింది.

అయితే కృతి ఎంత వేగంగా పాపులర్ అయిందో అంతే వేగంగా కింద పడిపోయింది. కృతి మూడవ సినిమా బంగారు రాజు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్స్ సొంతం చేసుకుంది . ఇక ఆ తర్వాత ఆమె నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ లాంటి సినిమాలు వరుస డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఒక్కసారి అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. డిమాండ్ పడిపోవడంతో అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఒక ఏడాది కాలం పాటు తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా కృతి ఖాతాలో పడలేదు.

ట్రెడిషనల్ హీరోయిన్‌గా ముద్ర పడింది కాబట్టి ఛాన్సులు రావడం లేదు అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేసి హల్చల్ చేసింది. తన పారితోషకం కూడా సగానికి సగం తగ్గించేసింది. అయినా కానీ ఊహించిన విధంగా చాన్సులు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు శర్వానంద్ చేస్తున్న మనమే మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇది కాక తమిళ్లో మరొక రెండు సినిమాలు కృతి చేతిలో ఉన్నాయి.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News