Laggam: లగ్గం సినిమాకి ముహూర్తం ఫిక్స్.. విడుదల అప్పుడే అంటున్న చిత్ర బృందం

Laggam Trailer: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా నటించిన లగ్గం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలకి సిద్ధం అయ్యింది. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమాకి సంబంధించిన అధికారిక విడుదల తేదీ గురించి ఖరారు చేసారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర బృందం చాలా కన్ఫిడెంట్ గా ఉంది. ఇంకా ఈ సినిమా గురించి ఇంకొన్ని విషయాలు చిత్ర బృందం తెలియజేసింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 16, 2024, 09:39 PM IST
Laggam: లగ్గం సినిమాకి ముహూర్తం ఫిక్స్.. విడుదల అప్పుడే అంటున్న చిత్ర బృందం

Laggam Release Date: ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అంచనాలు పెంచుతున్న చిన్న బడ్జెట్ సినిమా లగ్గం. సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం బాధ్యతలు మొత్తం రమేశ్ చెప్పాల చేపట్టారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. 

ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆల్రెడీ నిర్మాణాంతర  కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

ఆసక్తికరమైన కథ, స్క్రీన్ ప్లే, మంచి ప్లేజెంట్ మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్స్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ, నిర్మాత వేణుగోపాల్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. 

సినిమాలో కీలక పాత్ర పోషించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా ఇది" అని అన్నారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, కిరీటి, రవి వర్మ, వివా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ నేపథ్య సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా పని చేశారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే

Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News