Leo Update: లియో మూవీ నుంచి 'నా రెడీ సాంగ్' తెలుగు వెర్ష‌న్ వ‌చ్చేసింది..!

Leo Movie:  కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ 'లియో'. తాజాగా నా రెడీ సాంగ్ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 11:52 PM IST
Leo Update: లియో మూవీ నుంచి 'నా రెడీ సాంగ్' తెలుగు వెర్ష‌న్ వ‌చ్చేసింది..!

Leo Movie Update: దళపతి విజయ్-లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'లియో'. ఇందులో విజయ్ కు జోడిగా త్రిష నటించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్, మాథ్యూ థామస్ కీలకపాత్రల్లో నటించారు. లియో మూవీని లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి నిర్మించారు. మాస్టార్ తర్వాత విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగా అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అక్టోబరు 19న ఆడియెన్స్ ముందుకు రానుంది. 

తాజాగా తెలుగు ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది మూవీటీమ్. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫ‌స్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ (Naa Ready) ఎంత పెద్ద హిట్ట‌యిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాట‌ను తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం హిందీ వెర్ష‌న్‌లో రిలీజ్ చేశారు. ఈ పాటను తమిళంలో విష్ణు ఎడవన్ రాయగా.. దళపతి విజయ్‌, అనిరుధ్‌ రవిచందర్ కలిసి అలపించారు. తెలుగులో ఈ పాటను రేవంత్ పాడాడు. రఘురామ్ లిరిక్స్ అందించాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News