Telugu Film Industry CM Revanth Reddy Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. ఎఫ్‌డీసీ చైర్మెన్ దిల్ రాజు డైరెక్షన్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి టాలీవుడ్ నుంచి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 12 మంది హీరోలు హాజరయ్యారు. అయితే టాలీవుడ్ టాప్ హీరోలు మాత్రం సమావేశానికి రాలేదు. అగ్రహీరోల్లో హీరో నాగార్జున ఒక్కరే వచ్ారు. హీరోలు శ్రీకాంత్, కిరణ్ అబ్బవరం, సినీ పెద్దలు మురళీమోహన్, రాఘవేంద్రరావు, అల్లు అర్వింద్, బోయపాటి శివ, కొరటాల శివ, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, నిర్మాతలు రవి, నాగ అశ్విన్, సీ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ సమస్యలు, బౌనర్ల అంశంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి, టికెట్ రేట్ల పెంపు వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..