మహేష్ బాబు విడుదల చేసిన వీడియో: ఇలాంటి బాస్‌ దగ్గర పనిచేయడం కష్టమేనట!

నన్ను దోచుకుందువటే సినిమా నుంచి బిగ్‌బాస్ హౌజ్ ఆంథెమ్‌ను విడుదల చేసిన మహేష్ బాబు

Last Updated : Aug 20, 2018, 09:37 PM IST
మహేష్ బాబు విడుదల చేసిన వీడియో: ఇలాంటి బాస్‌ దగ్గర పనిచేయడం కష్టమేనట!

సుధీర్ బాబు నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా నన్ను దోచుకుందువటేలోని ఓ వీడియో పాటను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. బిగ్‌బాస్ హౌజ్ ఆంథెమ్ పేరిట విడుదలైన ఈ పాట చూస్తే, ఈ సినిమలో సుధీర్ బాబు పాత్ర తీరుతెన్నులేంటో ఓ అంచనాకు రావచ్చు. "ఓరి దేవుడా బిగ్‌బాస్ హౌజ్‌లోని బాస్ వీడురా.. నచోడేగా కిసీకో.." అని మొదలయ్యే ఈ పాట లిరిక్స్ వింటుంటే ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర ఎంత సీరియస్‌గా ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. అన్నింటికిమించి రాజమౌళి ఫ్రేము కూడా చూపలేదు వీడి విలనిజం అంటూ సుధీర్ బాబులోని పనిరాక్షసుడిని ఒక రేంజ్‌లో వర్ణించారు ఈ పాటను రచించిన గేయరచయిత క్రిష్ణాజీ. 

కృష్ణాజీ రచించిన లిరిక్స్‌కి తగినట్టుగానే హారర్ నేపథ్యంతో కూడిన లొకేషన్స్, గెటప్స్‌తో ఈ పాటను చిత్రీకరించారు దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు. మరి ఇంకెందుకు ఆలస్యం..! ఇలాంటి బాస్ దగ్గర పనిచేయడం కష్టమే అని సుధీర్ బాబు ఆఫీస్ సిబ్బంది పాడుకుంటున్న బిగ్‌బాస్ హౌజ్ ఆంథెమ్‌పై మీరూ ఓ లుక్కేయండి. 

Trending News