Sarkaru Vaari Paata: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... 'సర్కారు వారి పాట' నుంచి అప్‌డేట్‌ల వర్షం..

Sarkaru Vaari Paata: సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' తొలి సాంగ్​కు సంబంధించిన నాలుగు అప్డేట్స్​ అభిమానుల కోసం ఈ వారంలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 04:40 PM IST
Sarkaru Vaari Paata: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... 'సర్కారు వారి పాట' నుంచి అప్‌డేట్‌ల వర్షం..

Sarkaru Vaari Paata Movie Updates: ఈ వారం మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకు పండగ కానుంది. ఈ ప్రేమికుల రోజున మహేశ్ చిత్రం 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) మూవీ నుండి తొలి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరుకే ప్రకటించారు. అయితే అంతకంటే ముందు వరుస అప్ డేట్స్ సందడి చేయనున్నట్లు 'సర్కారు వారి పాట' చిత్ర బృందం తెలిపింది. ఈరోజు నుండి, థమన్ కంపోజ్ చేసిన మొదటి సింగిల్ గురించి ఫిబ్రవరి 7, 9, 11, 14 తేదీల్లో ప్రధాన అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో (Social Media) విడుదల కానున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని జీఎంబీ (GMB) ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మించాయి.  ఈ సినిమాను ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల మందుకు రానుంది. సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా...కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాకుండా ఒకే సమయంలో హీరోహీరోయిన్లు కొవిడ్ బారిన పడటం సినిమా షూటింగ్ పై ప్రభావం చూపింది. 

Also Read: F3 First Lyrical Song: మనీకి అంతం లేదు.. ఈ MONEY ANTHEM కి తిరుగు లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitter మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News