TS Govt granted Permission for Special Shows for SVP Movie in Hyderabad: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్ కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట'. గురువారం (మే 12న) ఎస్‌వీపీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్లు దాటిన నేపథ్యంలో ఎస్‌వీపీ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. సూపర్ స్టార్ అభిమానులు అయితే సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల నేపథ్యంలో అభిమానులకు చిత్ర యూనిట్ భారీ సర్ప్రైజ్ ఇచ్చింది.
'సర్కారు వారి పాట' సినిమా స్పెషల్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 4 గంటల 5 నిమిషాలకు షో వేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని నాలుగు థియేటర్లకు ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్.. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో తెల్లవారు జామున 4 గంటలకు ఎస్‌వీపీ స్పెషల్ షోలు పడనున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వినతి మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
గురువారం తెల్లవారు జామునే ఎస్‌వీపీ చిత్రం స్పెషల్ షోలు పడుతున్నాయన్న విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ షో చూసేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎస్‌వీపీ మేనియా మొదలైంది. ప్రతిఒక్కరు మహేష్ బాబు జపం చేస్తున్నారు. థియేటర్ల వద్ద సూపర్ స్టార్ పెద్దపెద్ద కటౌట్స్ పెట్టి సందడి చేస్తున్నారు. మరోవైపు చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని.. అందుకు సంబందించిన టికెట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సంతోషంను పంచుకుంటున్నారు.
ఎస్‌వీపీ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తూ 'టాక్ ఆఫ్ ది టౌన్'గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.120 కోట్ల వరకు జరిగిందని సమాచారం. తొలి షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్‌తో బాక్సాపీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎస్‌వీపీ సినిమా వీకెండ్‌లో భారీ వసూళ్లను సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజుకి రెండు స్పూన్ల ఈ విత్తనాలు తింటే చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.