తెలంగాణ పోలీసు అకాడమిని సందర్శించిన మహేష్ బాబు

తెలంగాణ పోలీసు అకాడమిని సందర్శించిన మహేష్ బాబు

Last Updated : Aug 1, 2018, 07:57 PM IST
తెలంగాణ పోలీసు అకాడమిని సందర్శించిన మహేష్ బాబు

సూపర్ స్టా్ర్ మహేష్ బాబు తాజాగా తెలంగాణ పోలీసు అకాడమిని సందర్శించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు కొత్త సినిమాలో అతడు ఓ కాలేజ్ స్టూడెంట్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కథలో భాగంగా క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతోపాటు ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించాల్సి ఉండటంతో ఆయా సన్నివేశాల చిత్రీకరణకు తెలంగాణ పోలీసు అకాడమి అనువైన ప్రదేశం అని భావించిన మహేష్ బాబు, వంశీ పైడిపల్లి... నేరుగా అకాడమికే వెళ్లి అక్కడి పోలీసు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు విజ్ఞప్తికి తెలంగాణ పోలీసు అకాడమి ఉన్నతాధికారుల నుంచి సైతం సానుకూల స్పందన లభించినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై అటు అకాడమి అధికారులు కానీ లేదా ఇటు మూవీ యూనిట్ సభ్యులు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఊపిరి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్లోనే డెహ్రాడూన్‌లో చిత్రీకరించుకుని వచ్చిన యూనిట్ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది.

Trending News