AMB Classics at RTC X Roads:
సినిమాలలో తన నటనతో సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు బిజినెస్ రంగంలో సైతం.. మంచి విజయాలు అందుకుంటూ ఉంటాడు. మహేష్ బాబు మొదలుపెట్టిన ఎయంబి మల్టీప్లెక్స్ ఆయనకి మంచి ఆదాయమే తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు మరో మల్టీప్లెక్స్ ని తనకు ఇష్టమైన ప్రదేశంలో మొదలుపెట్టనున్నారు ఈ హీరో.
హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ కు మహేష్ బాబుకి ముందే కలెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అక్కడ సిల్వర్ జూబిలీ ఆడి రికార్డులు నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా సుదర్శన్ 35 ఎంఎంని తమ కోటగా భావిస్తారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ కే కాదు ఎంతోమంది సినీ అభిమానులకు ఆర్టీసీ క్రాస్ రోడ్ తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉంటుంది. కాకా అలాంటి దగ్గర మహేష్ ఏకంగా ఒక మల్టీప్లెక్స్ కడితే ఎలా ఉంటుంది. అదే నిజం కాబోతోంది.
గచ్చిబౌలిలో ఏఎంబి సూపర్ ప్లెక్స్ స్థాపించి మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఇప్పుడు మహేష్ బాబు దాన్ని మించిన మరో మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నాడు. గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న స్థానంలో ఇప్పుడు ఏఎంబి క్లాసిక్స్ ముస్తాబు కాబోతోంది. దాదాపు ఏరు స్క్రీన్లతో ఎఎంబి క్లాసిక్ అనే పేరుతో ఏషియన్ భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు.
ఈ మల్టీప్లెక్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వెంకటేష్ పార్ట్ నర్ గా ఇది నిర్మిస్తారనే ప్రచారం జరిగింది .. అయితే ఇప్పుడు ఆస్థానంలోకి మహేష్ బాబు రావడం విశేషం. సింగల్ స్క్రీన్లకు నెలవుగా ఉండే క్రాస్ రోడ్స్ లో ఏ ఎం బి క్లాసిక్స్ మొదటి మల్టీప్లెక్స్ కానుంది. కొత్త రిలీజులు ఎవరైనా సరే ఇక్కడ మొదటి రోజు చూడటం ఎంతో ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు.. ఒకవేళ ఫస్ట్ డే మిస్ అయినా తర్వాతి రోజుల్లో అయినా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూస్తే తప్ప సంతృప్తి చెందని మూవీ లవర్స్ కు కొదవే లేదు. మరి అలాంటి చోట మహేష్ బాబు ఏకంగా మల్టీప్లెక్స్ పెడుతూ ఉండడం.. సూపర్ ఐడియా అంటూ సినిమా అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం శాంతి, సప్తగిరి, తారకరామ, శ్రీ మయూరి, సుదర్శన్ 35, సంధ్య 70, సంధ్య 35, దేవి 70 థియేటర్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ కూడా ఈ చోటుకి రావడంతో కొత్త సినిమా రిలీజ్ అయితే ట్రాఫిక్ సమస్యలు మాత్రం ఎక్కువ కావడం ఖాయంలా కనిపిస్తోంది.
Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్ పిలుపు
Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి