Evaru Meelo Koteeswarulu New Promo: బుల్లితెరపై మహేష్ – ఎన్టీఆర్ సందడి.. ప్రోమో రిలీజ్..

Evaru Meelo Koteeswarulu New Promo: టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సిద్ధమయ్యారు. అయితే అది ఆయన సింగిల్ గా కాదు.. హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో పాల్గొని సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 01:57 PM IST
Evaru Meelo Koteeswarulu New Promo: బుల్లితెరపై మహేష్ – ఎన్టీఆర్ సందడి.. ప్రోమో రిలీజ్..

Evaru Meelo Koteeswarulu New Promo: ఇద్దరు టాలీవుడ్ స్టార్‌ హీరోల సరదా మాటలకు వేదికైంది 'ఎవరు మీలో కోటీశ్వరులు' (Evaru Meelo Kotiswarulu) రియాలిటీ షో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR News) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో లో సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu News) సందడి చేశారు. ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు ఫుల్‌ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌.. ఓ స్పెషల్‌ టీజర్ నెట్టింట్లో షేర్‌ చేసింది. 

తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్‌ షోలో ఇప్పటివరకు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ప్రారంభ ఎపిసోడ్​లో రామ్‌చరణ్‌ పాల్గొని అలరించారు. రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, సమంతలు కూడా ఈ స్టేజ్‌పై తళుక్కున మెరిసి.. ఎన్టీఆర్‌ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో మహేశ్‌ ఎపిసోడ్‌ (Mahesh Babu NTR) ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సర్కారు వారి పాటతో వేసవిలో..

ఇక సినిమాల పరంగా.. మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' (sarkaru vaari paata release date) ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల కానుంది. బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేశ్ (keerthy suresh movies) నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్​తో (trivikram next movie) కలిసి పనిచేస్తారు మహేశ్. వీరి కాంబినేషన్​లో రాబోయే మూడో చిత్రమిది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన 'అతడు', 'ఖలేజా'.. ప్రేక్షకులను అలరించాయి.

రామ్ చరణ్ తో కలిసి తారక్..

రామ్‌చరణ్‌ - తారక్‌ మల్టీస్టారర్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో చరణ్‌ (Ramcharan) అల్లూరి సీతారామరాజుగా.. తారక్‌ (NTR) కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌ (Alia Bhatt).. ఎన్టీఆర్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Also Read: ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్ విడిపోనున్నారా?.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

Also Read: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి నెక్ట్స్ ఎలిమినేషన్ ఎవరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News