Trisha: నేను త్రిష గురించి గొప్పగా చెప్పుకొచ్చా.. ఫైనల్ గా వివాదం పై స్పందించిన మన్సూర్

Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు నిన్నటి నుంచి దుమారం రేపుతున్నాయి. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తీవ్రస్థాయిలో మంది పడ్డారు. కాగా ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇస్తూ ఒక పెద్ద లేఖ రాశారు మన్సూర్ అలీ ఖాన్.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 05:03 PM IST
Trisha: నేను త్రిష గురించి గొప్పగా చెప్పుకొచ్చా.. ఫైనల్ గా వివాదం పై స్పందించిన మన్సూర్

 Mansoor Ali Khan Instagram post: ప్రముఖ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు నిన్నటి నుంచి దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లియోలో హీరోకి ఫ్రెండ్ గా కనిపించిన ఈయన త్రిష తో తనకు బెడ్ రూమ్ సీన్ ఉంటుంది అనుకున్నా అని.. లేకపోవడం బాధ కలిగించిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళ ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిష కూడా ఇంకెప్పుడు అలాంటి నటుడితో నటించను అని పోస్ట్ చేసింది. కాగా తాజాగా ఆ వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ వివరణ ఇచ్చారు. 

త్రిష, లోకేష్ కనగరాజు, మాళవిక, చిన్మయి శ్రీపాద ఇలా చాలామంది తమ సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా మన్సూర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయగా.. మన్సూర్ ఆలీ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు. ఒక మనిషిగా ప్రజలకు తానెంతో చేశానని, తన మంచి తనం గురించి చెప్పుకునే ప్రయత్నం చేశారు.  అంతేకాదు తనను లక్ష్యంగా చేసుకుని ఇలా చేయడం తనపై పరువునష్టం దావా వేయడం లాంటిదేనని పేర్కొన్నారు. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl)

ఆయన త్రిష గురించి చేసిన వ్యాఖ్యల గురించి చెబుతూ ‘త్రిష గురించి నేను మీడియాతో తప్పుగా మాట్లాడానని వార్తలు వస్తున్నట్టు.. ఈ విషయాన్ని నా పిల్లలు నా దృష్టికి తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే నేను త్రిషని పొగిడాను. హనుమంతుడు చిరంజీవి పర్వతాన్ని ఎలా అయితే మోసారో.. లియో సినిమాలో త్రిషను కూడా అలాగే ట్రీట్ చేశాం. నేనేదో సరదాగా ఆ కామెంట్ చేశాను. కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఈ కామెంట్‌ను చీల్చి చండాడుతున్నారు. అంతేకాకుండా, త్రిషకు కూడా నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. వారి బెదిరింపులకు నేను భయపడను. గతంలో నాతో కలిసి నటించిన ఎంతో మంది హీరోయిన్లు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రలుగా ఉన్నారు. కొంత మంది హీరోయిన్లు వ్యాపారవేత్తలను చేసుకుని స్థిరపడ్డారు. నా కూతురు దిల్ రూప మీకు (త్రిషకు) చాలా పెద్ద ఫ్యాన్. నాకు ఇంకో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు కావాల్సి ఉంది. నేనే వాళ్ల పెళ్లిళ్లు చేయాలి. నేను మహిళలను ఎంతగా గౌరవిస్తానో నాతో కలిసి నటించిన అందరికీ తెలుసు. నేను త్రిషను అవమానపరిచానని కొంత మంది నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు…దీని కన్నా ముఖ్యమైన సమస్యలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ముందు వాటిపై ఫోకస్ పెట్టండి’ అని తన ప్రకటనలో మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

  

Trending News