Sreeleela: శ్రీలీలాని మించిపోతున్న మీనాక్షి చౌదరి.. కారణం అదేనా!

Sreeleela Upcoming Movies: పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న శ్రీ లీల మీద ఆఫర్ ల వర్షం కురిసింది. అలా వచ్చిన ప్రతి సినిమా ఓకే చేసేసి వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుంది ఈ భామ. దీంతో ఈమె క్రేజ్ బాగా తగ్గిపోగా మీనాక్షి చౌదరి మీద అందరి దృష్టి పడింది. ప్రస్తుతం శ్రీ లీల కి గట్టి పోటీ ఇస్తూ వరుస ఆఫర్లు అందుకుంటోంది మీనాక్షి చౌదరి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2024, 11:38 AM IST
Sreeleela: శ్రీలీలాని మించిపోతున్న మీనాక్షి చౌదరి.. కారణం అదేనా!

Meenakshi Choudhary: పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీ లీల ఆ తరువాత ధమాకా సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ తో వరుస సినిమా ఆఫర్లు కూడా అందుకుంది. చేతిలో బోలెడు సినిమాలతో శ్రీ లీల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇది నిన్న మొన్నటిదాకా విషయం కానీ ఇప్పుడు కథ మారింది. తన దారికి వచ్చిన ప్రతి ఆఫర్ ను ఒప్పుకున్న శ్రీ లీల ఇప్పుడు వరుస డిజాస్టర్లతో సతమతమైంది. పేరుకి బోలెడు సినిమాల్లో నటించింది కానీ భగవంత్ కేసరి తప్ప మిగతా మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి.

ఆది కేశవ, స్కంద, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలతో శ్రీ లీల మార్కెట్ భారీ స్థాయిలో పడిపోయింది. వసూళ్ల పరంగా చూస్తే మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం సినిమా కొంతవరకు బెటర్ అని చెప్పొచ్చు అది కూడా బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు.

ప్రస్తుతం ఎంబిబిఎస్ పరీక్షల కోసం కొంత గ్యాప్ తీసుకున్న శ్రీ లీల చేతిలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. నితిన్ రాబిన్ హుడ్ సినిమాకి కూడా శ్రీ లీల ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు కొత్త కథలు కూడా వినడం లేదు.

ఈ గ్యాప్ లో మీనాక్షి చౌదరి తన స్పీడ్ ని భారీగా పెంచేసింది. గుంటూరు కారం సినిమాలో ఏదో మొక్కుబడి పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి కి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) సినిమాలో నటించే అవకాశం అందుకొని పెద్ద జాక్పాట్ కొట్టింది. ఈ సినిమా గనుక హిట్ అయితే తమిళ్ నిర్మాతలందరూ ఈమె వెనుక పడతారు అనడంలో అతిశయోక్తి లేదు.

మరోవైపు తెలుగులో కూడా వరుణ్ తేజ్ సరసన మట్కా లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది మీనాక్షి. విశ్వక్ సేన్ నటిస్తున్న మెకానిక్ రాకీ సినిమాతో కూడా బిజీగా ఉన్న మీనాక్షి దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఒకప్పుడు శ్రీలీల లాగా ఇప్పుడు మీనాక్షి చౌదరి వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంది. మంచి హీరోలతోనే సినిమాలు ఉన్నాయి కాబట్టి అందులో రెండు బ్లాక్ బస్టర్లు అయినా ఈమె కరియర్ మారిపోయినట్లే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన్న కంటే ఈ ఏడాది ఈమేవే ఎక్కువ సినిమాలు విడుదల కు రెడీ అవుతూ ఉండటం విశేషం.

Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌

Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News