Megastar Chiranjeevi to do Bro Daddy Movie Remake: మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన బంగార్రాజు లాంటి సినిమాలతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ సోదరుడు కూరసాల కన్నబాబు మెగాస్టార్ చిరంజీవి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఆయన మంత్రిగా ఉన్నా ఒకప్పుడు ప్రజారాజ్యం నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలైంది.
కాబట్టి చిరంజీవికి ఆయన చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అయితే అలాంటి కన్నబాబు సోదరుడు కళ్యాణ్ కృష్ణ చిరంజీవి డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, శ్రీ లీల ప్రధాన పాత్రలలో నటించబోతున్నట్లు కూడా కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఒక మలయాళ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది.
Also Read: Adah Sharma Craze: 15 ఏళ్ల తరువాత హీరోయిన్ గా బ్రేక్ అందుకున్న ఆదా శర్మ
మలయాళం లో బ్రో డాడీ అనే సినిమా రిలీజ్ ఆప్ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ తండ్రి పాత్రలో నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కొడుకు పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారున్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటించగా మోహన్ లాల్ సరసన మీనా నటించింది.
ఈ క్రమంలో దీన్ని తెలుగు నేటివిటీ ఉన్న సినిమాగా మలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఒక సీనియర్ హీరోయిన్ ని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు, ఎందుకంటే ఇప్పటికే భాష రాకపోయినా సబ్ టైటిల్స్ తో ఆ సినిమాలు చూసేస్తూ ఉన్న నేపథ్యంలో ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప తెలుగు భాషలో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ తెలుగు బ్రో డాడీ కోసం ఎలాంటి హంగులు చేర్చబోతున్నారు అనే అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు దర్శకుడు మెప్పించబోతున్నాడు అనేది చూడాల్సి ఉంది. అయితే ఇది ప్రచారమే కాగా నిజంగా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: SSMB 28 Problems: మహేష్-త్రివిక్రమ్ సినిమాకి కొత్త సమస్యలు.. అసలు సంగతి ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook