RGV on Appu: కన్నడ ప్రజల గుండెల్లో అప్పు ఎప్పటికీ ఉండిపోతారు: ఆర్జీవీ

RGV on Appu: కన్నడ పవర్​ స్టార్ పునీత్ రాజ్​ కుమార్ లేరన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నాన్నారు దర్శకుడు ఆర్జీవీ. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆర్జీవీ.. పునీత్​ ఘాట్​ను సందర్శించి నివాళులర్పించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 06:14 PM IST
  • పునీత్​కు ఆర్జీవీ నివాళులు
  • బెంగళూరులో పునీత్ రాజ్​కుమార్ ఘాట్​ సందర్శన
  • కన్నడ ప్రజల గుండెల్లో అప్పు చిరస్మరణీయమని..
RGV on Appu: కన్నడ ప్రజల గుండెల్లో అప్పు ఎప్పటికీ ఉండిపోతారు: ఆర్జీవీ

RGV on Appu: ప్రముఖ దర్శకుడు రామ్​ గోపాల్​ వర్మ.. కన్నడ పవర్​ స్టార్ పునీత్ రాజ్​ కుమార్ ఘాట్​ను సందర్శించారు. 'ఖత్రా' మూవీ ప్రమోషన్స్​లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆ​ర్జీవీ, ఇతర చిత్ర బృందం.. పునీత్ రాజ్​ సమాధి వద్ద నివాళులర్పించారు.

అప్పు.. లేరన్న వార్త ఇంకా షాకింగ్​గానే ఉంది..

అప్పు లేరన్న వార్త ఇంకా షాకింగానే ఉందని ఆర్జీవీ అన్నారు. ఆయన్ను రెండు మూడుసార్లు కలిశానని చెప్పారు. కన్నడా ప్రజల్లో గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు ఆర్జీవి.

పునీత్ రాజ్​కుమార్ మరణం గురించి..

కన్నడ సూపర్​ స్టార్​ డాక్టర్​ రాజ్​ కుమార్ చిన్న కుమారుడే పునీత్ రాజ్​కుమార్​. చైల్డ్ ఆర్టిస్ట్​గా మెప్పించి..  ఆ తర్వాత 2002లో వచ్చిన అప్పు సినిమాతో సంచనలం సృష్టించారు. అలా హిట్టు మీద హిట్టు కొడుతూ కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత ఫ్యాన్​ బేస్​ను సొంతం చేసుకున్నారు.

సినిమాలాలతో పాటు దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ఆయనకు ఆయనే సాటి.. ఎంతో మంతి చిన్నారులకు సొంత ఖర్చుతో చదువు చెప్పించారు. ఎవరు ఏ సమస్యతో తన వద్దకు వచ్చినా.. కాదనకుండా, లేదనకుంటా ఇవ్వడం ఆయన అలవాటు. సినిమాలలతో ఎంత పేరు పునీత్ రాజ్​కుమార్ ఎంత పేరు సంపాదించారో.. సేవా కార్యక్రమాలతో అంతకన్నా గొప్ప పేరు సంపాదించారాయన.

క్రమంగా తప్పకుండా వ్యాయామం చేస్తూ.. ఎప్పుడు ఫిట్​గా ఉండే పునీత్ రాజ్​కుమార్​ గుండే పోటు కారణంగా గత ఏడాది అక్టోబర్ 29న తుది శ్వాస విడిచారు. 46 ఏళ్ల చిన్న వయసులోనే అప్పు ప్రాణాలు కోల్పోవడం యావత్​ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఇప్పటికీ ఆయన లేరనే వార్తను ఎంతో మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

Also read: Malaika Arora: హాట్ బ్యూటీ మలైకా అరోరా స్టన్నింగ్ అందాలు చూశారా

Also read: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. సినీతారలను ప్రశ్నించనున్న ఈడీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x