Malaikottai Vaaliban OTT News: ప్రముఖ ఓటీటీలో మోహన్‌లాల్ 'మలైకోట్టె వాలిబన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

Mohanlal - Malaikottai Vaaliban OTT News: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం ఆయన స్టైల్. రీసెంట్‌గా ఈయన 'మలైకోట్టె వాలిబన్' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చే డేట్ ఫిక్స్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2024, 03:38 PM IST
Malaikottai Vaaliban OTT News: ప్రముఖ ఓటీటీలో మోహన్‌లాల్ 'మలైకోట్టె వాలిబన్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

Mohanlal - Malaikottai Vaaliban OTT News: హీరో మోహన్‌లాల్‌ను ఎన్నో ఆశలు పెట్టుకున్న 'మలైకోట్టై వాలిబన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణగా దెబ్బ తింది.  మలయాళ బాహుబలిగా ఈ సినిమా ప్రమోట్ చేసినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. అంతేకాదు ఈ మూవీ మోహన్‌లాల్‌కు తీవ్ర పరాభవాన్ని మిగిల్చింది.
మోహన్‌లాల్ విషయానికొస్తే.. మన దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్‌లాల్‌కు ఒకరు. ఒక వైపు కమర్షియల్ హీరోగా రాణిస్తూనే.. తనలోని ఉన్న యాక్టర్‌ను తృప్టి పరచడానికి ఆర్ట్ చిత్రాల్లో నటిస్తూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడిగా ఎదిగారు. మోహన్‌లాల్ మలయాళ భాషకే పరిమితం కాకుండా.. తెలుగు, హిందీ సహా అన్ని ప్యాన్ ఇండియా భాష చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాలతో కూడా మోహన్‌లాల్‌కు మంచి అనుబంధమే ఉంది. అప్పట్లో తన ప్రియమిత్రుడు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ హీరోలుగా రోజా హీరోయన్‌గా నటించిన 'గాండీవం' సినిమాలో ఓ పాటలో మెరిసారు. ఆ తర్వాత 'మనసంతా', ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' సినిమాలతో పలకరించారు.

మోహన్‌లాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. జనతా గ్యారేజ్‌ తర్వాత 'మన్యం పులి' సినిమాతో ఇక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన 'మలైకోట్టై వాలిబన్'(Malaikottai Vaaliban) సినిమా రిపబ్లిక్ డే కానుకగా విడుదలై దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమాకు బాహుబలితో పోలిక పెట్టి మంచి హైప్ తీసుకొచ్చారు. తీరా విడుదలయ్యాకా.. తుస్సుమంది.బాహుబలి సక్సెస్ తర్వాత ఈ రేంజ్‌లో అన్ని ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కినా.. అందులో ఏదో ఒకటి అర మినహా పెద్దగా సక్సెస్ అయినా దాఖలాలు లేవు. అంతేకాదు బాహుబలి మ్యాజిక్‌ను ఒక రకంగా రిపీట్ చేయలేకపోయాయి.

ఇక 'మలైకోట్టై వాలిబన్' కంటే ముందు మమ్మట్టి.. 'మామంగం' అనే భారీ బడ్జెట్ సినిమా తీయగా అది కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.  పరిచింది. ఆ తర్వాత అరేబియా సముద్ర సింహం అంటూ 'మరక్కర్' చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. కానీ కీలకమైన ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.

రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన 'మలైకోట్టై వాలిబన్' చిత్రానికి తొలి రోజు ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ యాక్టింగ్.. క్లైమాక్స్ సన్నివేశాలు మినహా సినిమా పెద్దగా అలరించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. అక్కడ మలయాళంలో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోని 'మలైకోట్టై వాలిబన్' చిత్రం ఓటీటీ వేదికగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News