Mokshagna: కొడుకు కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపిన బాలకృష్ణ.. ఎవరంటే!

Mokshagna Debut: నందమూరి అభిమానుల కన్న కలలు.. నిజమయ్యాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. ఇప్పుడు హీరోగా సినిమాల్లోకి రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం.. బాలయ్య ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారు.. అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

Written by - Vishnupriya | Last Updated : Jul 5, 2024, 09:58 PM IST
Mokshagna: కొడుకు కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపిన బాలకృష్ణ.. ఎవరంటే!

Mokshagna Debut Movie Update: నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. త్వరలో సినీ రంగంలో అడుగుపెట్టబోతున్నాడు.. అన్న వార్త నందమూరి అభిమానులలో పండగ వాతావరణం ఏర్పడేలా చేసింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఊరట చెందుతున్నారు. 

Add Zee News as a Preferred Source

మొన్నటిదాకా కొంచెం బొద్దుగా.. ఉండే మోక్షజ్ఞ ఇప్పుడు స్లిమ్ గా మారిపోయి ఫిట్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కొత్త హాండ్సమ్ లుక్స్‌లో కనిపిస్తున్న మోక్షజ్ఞ ఫోటోలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మోక్షజ్ఞ సినిమాను ప్రశాంత్ వర్మ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారని.. సమాచారం. ఆయన చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు.. చాలా నచ్చిందట. మోక్షజ్ఞకి ఇది కరెక్ట్‌గా సూట్.. అవుతుందని అనిపించడంతో బాలయ్య వెంటనే ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే సినిమాలో మోక్షజ్ఞకి జోడీగా.. శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈమధ్యనే బాలకృష్ణన్ భగవంత్ కేసరి సినిమాలో.. బాలయ్య కూతురిగా కనిపించిన శ్రీలీల ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య కొడుకుతో జతకట్టనుంది. శ్రీలీలలో ఉన్న టాలెంట్‌ నచ్చి మోక్షజ్ఞ పక్కన.. బావుంటుంది అని బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే ఇండస్ట్రీలో గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. 

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా హిట్ అయితే నందమూరి కుటుంబం నుంచి మరో స్టార్ వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఇన్ని అంచనాల మధ్య మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇవ్వబోతున్నాడు. కొంచెం అటు.. ఇటు.. అయినా కూడా ప్రభావం నందమూరి కుటుంబం మీద పడుతుంది. అందుకే బాలకృష్ణ కూడా ఈ సినిమాకి..సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా.. ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమా.. హిట్ అయితే తనకి ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం సులువు అయిపోతుంది.. అని బాలయ్య అనుకుంటున్నారు. మరి ఈ యంగ్ హీరో నందమూరి అభిమానుల.. అంచనాలు అందుకుంటాడో లేదో చూడాలి.

Also Read: Telangana Thalli Statue: తెలంగాణలో బుల్డోజర్‌ పాలన? తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా స్థానం లేదా?

Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News