Tiger Nageswara Rao: ముందుగా ప్రకటించిన తేదీకే వస్తున్న రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'.. !

Raviteja Upcoming Movie: మాస్ మహారాజా లేటెస్ట్ సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడందనే వార్తలు నెట్టంట చక్కెర్లు కొడుతున్నాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 11:50 AM IST
Tiger Nageswara Rao: ముందుగా ప్రకటించిన తేదీకే వస్తున్న రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'.. !

Tiger Nageswara Rao Release date: హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న హీరో మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ(Ravi Teja) నటిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara Rao Movie). వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా రీలీజ్ డేట్ గురించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూవీని అక్టోబర్‌ 20న చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు మేకర్స్. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగానే సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోను అయిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ మూవీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను అనుకున్న తేదీగా రిలీజ్ చేస్తున్నామని వారు ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 20న టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. 

Also Read: Samajavaragamana OTT: ఓటీటీలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న 'సామజవరగమన'.. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత రావణాసుర సినిమాతో అడియెన్స్ కు ముందుకొచ్చాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇది ఓటీటీలో మాత్రం బాగానే ఆడింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్న రవితేజ.. మరోవైపు ఈగల్ లో కూడా నటిస్తున్నాడు. 

Also Read: Karthik Aaryan: పారాలింపిక్ ఛాంపియన్ బయోపిక్‌లో కార్తిక్‌ ఆర్యన్‌.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్‌ లుక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News