Tollywood Releases : ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే

Tollywood Releases this week : రావాల్సిన పెద్ద సినిమాలు అన్నీ వచ్చేయడంతో ఇప్పుడు చిన్న సినిమాలు అన్నీ రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం జూన్ 17న ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అనే విషయం మీద ఒక లుక్కు వేద్దామా. 

Last Updated : Jun 16, 2022, 12:25 PM IST
  • జూన్ 17న విరాటపర్వం
  • గాడ్సే సహా మరో రెండు చిన్న సినిమాలు
  • జీ 5 నుంచి రెక్కీ వెబ్ సిరీస్
Tollywood Releases : ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే

 

Tollywood Releases this week : తెలుగు సినిమా పరిశ్రమ నుంచి రావాల్సిన పెద్ద సినిమాలు అన్నీ వచ్చేశాయి. ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇక చిన్న సినిమాలు అన్నీ రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం అంటే జూన్ 17న ఏమేం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం. నిజానికి ఈ మధ్య ప్రేక్షకులు చిన్న సినిమాలు, బడ్జెట్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓటీటీలో చూద్దామనే ఫీలింగ్ కి వచ్చినా నిర్మాతలు కూడా వెనక్కు ఎక్కడా తగ్గడం లేదు.  
 

జూన్ 17న తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు రెండు విడుదల అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విరాటపర్వం గురించి. రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, సాయి చాంద్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ కలిసి నిర్మించారు. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇక మరో పక్క ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాభి కాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘గాడ్సే’. సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా కూడా 17న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా మీద కూడా అంచనాలున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజి, మేక రామకృష్ణ,అనంత్ నటీ నటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని హార్రర్-సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ “యు ఆర్ మై హీరో ” అనే సినిమాను నిర్మించారు. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. 

అలాగే బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా కిరోసిన్ సినిమా కూడా 17న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు ధృవనే ఒకపక్క హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఇక ఓటీటీ విషయానికి వస్తే సుమ కీలక పాత్రలో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. శివబాలాజీ, శ్రీ రామ్, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ రెక్కీ. ఈ సిరీస్ కూడా జూన్ 17వ తేదీ నుంచి ZEE5లో ప్రసారం కానుంది. ఇక మరో పక్క నయనతార ప్రధాన పాత్రలో నటించిన O2 అనే సినిమా కూడా ఈ నెల 17 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. విఘ్నేష్ శివన్‌తో వివాహం తర్వాత నయనతార హీరోయిన్ గా విడుదల కానున్న మొదటి సినిమా ఇది. 
 

Read Also :Choreographer Trinath Rao: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత...

Read Also :Virata Parvam: సాయి పల్లవి వ్యాఖ్యలతో చిక్కుల్లో విరాటపర్వం.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News