Tirumala Tirupati devastanam: సాధారణంగా తిరుమల శ్రీవారిని చాలా మంది భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. ఎక్కడి నుంచో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. గంటల కొద్ది క్యూలైన్ లలో, కంపార్ట్ మెంట్లలో వేచీచూస్తుంటారు. ఎన్ని గంటలైన సరే.. స్వామి వారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అయితే.. ఇటీవల కూటమి సర్కారు కూడా.. సామాన్య భక్తులకు ప్రయారిటీని ఇచ్చే విధంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వీఐపీ సేవల్లో ఎక్కువగా ఉండకూడదని.. టీటీడీ సామాన్య భక్తుల కోసం.. కేవలం గంట, అరగంటలో దర్శనం అయ్యేవిధంగా చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తిరుమలకు చాలా మంది ఉచిత దర్శనం, రూ. 300 టికెట్లు తీసుకుని వెళ్తుంటారు. కొంత మంది మాత్రం.. తమకు తెలిసిన నేతల సిఫారసులేఖలతో తిరుమలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు సిఫారసులు ఇస్తుంటారు. అయితే.. తిరుమలకు సిఫారసుల మీద వెళ్లే వారికి టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట.. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇక మీదట వారానికి రెండు మార్లు సిఫారసుల లేఖలను అనుమంతిచాలని నిర్ణయించినట్లు టీటీడీ స్పష్టం చేసింది.
అంటే ఒక వారంలో... టీటీడీ రెండు మార్లు ఆయా ప్రజా ప్రతినిధుల సిఫారసుల మీద దర్శనానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం అయ్యేలా అనుమతిస్తారన్నమాట. దీంతో ప్రజా ప్రతినిధులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇదే క్రమంలో ప్రస్తుతం.. తిరుమలలో ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Read more; Tirumala Updates: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్, జనవరి 9 నుంచి సర్వ దర్శనం ఉచిత టోకెన్లు జారీ ఎక్కడంటే
అదే విధంగా తాజాగా.. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం.. తిరుమలలో ఎక్కువగా తెలంగాణ భక్తులు వస్తున్నారని.. తెలంగాణ వారి వల్లే తిరుమలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ ఈ వ్యాఖ్యలపై మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. మరొవైపు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం టీటీడీ నిర్ణయం గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter