Naga Chaitanya: సూపర్ హిట్ దర్శకుడితో నాగచైతన్య.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే!

Naga Chaitanya Upcoming Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగచైతన్య. మంచి టాలెంట్ ఉన్న నటుడు అయినప్పటికీ గత కొద్దికాలంగా సరియైన హిట్ లేక బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతని ఆశలు అన్ని  తండేల్ మూవీ పై ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2024, 10:11 PM IST
Naga Chaitanya: సూపర్ హిట్ దర్శకుడితో నాగచైతన్య.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే!

Thandel: అక్కినేని నాగార్జున నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించే సత్తా ఉన్న నటుడు అయినప్పటికీ ఈ మధ్య మాత్రం ఈ హీరో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. రీసెంట్ గా అతను నటించిన కస్టడీ, థాంక్యూ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అయితే ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన దూత వెబ్ సిరీస్ మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో ఈసారి కచ్చితంగా బిగ్ స్క్రీన్ పై హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో చైతు తన రాబోతున్న తండేల్ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడు. మత్స్యకారుల జీవితంలో చోటుచేసుకునే కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తూ ఉన్న చిత్రమే తండేల్. ఈ మూవీ కోసం కసరత్తు చేసే క్రమంలో చైతు మరి ఏ మూవీ స్టోరీ వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ‘తండేల్’మూవీ షూటింగ్ వేగంగా జరగడమే కాకుండా అవుట్ పుట్ కూడా ఆశించిన దానికంటే అద్భుతంగా వస్తోందట. దీంతో ఖుషి అయిన చైతు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కాన్సెంట్రేట్ చేయడం మొదలుపెట్టాడు అని సమాచారం.

ఈ నేపథ్యంలో తాజాగా నాగచైతన్య ఓ సరికొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ కూడా నడుస్తోంది. విరూపాక్ష మూవీతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ దండుతో తన నెక్స్ట్ మూవీ చేయడానికి చైతు ఫిక్స్ అయ్యాడట. విరూపాక్ష మూవీ మంచి రెస్పాన్స్ అందుకున్న నేపథ్యంలో దానికి సీక్వెల్ తీయాలి అని కార్తీక్ కొన్ని రోజులపాటు సీక్వెల్ స్టోరీ రాయడానికి ప్రయత్నించారు. అయితే అనుకోని కొన్ని కారణాలవల్ల అది కుదరలేదు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు ఆ పని పక్కన పెట్టి మరో కొత్త స్టోరీ కి శ్రీకారం చుట్టాడు కార్తీక్. ఆ స్టోరీకి హీరోగా నాగచైతన్య బాగుంటాడు అని భావించిన కార్తీ క్ నాగచైతన్యను కలిసి స్టోరీ గురించి డిస్కస్ చేశారు.

కార్తీక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో చైతు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అయితే ఈసారి విరూపాక్ష సినిమాకి కాస్త డిఫరెంట్ గా మంచి కమర్షియల్ కంటెంట్ ఉండేలా కార్తీక్ మూవీ తెరకెక్కించబోతున్నారు. తండేల్ మూవీస్ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ నాగచైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అక్టోబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే అదే టైమ్ ని టార్గెట్ చేసుకొని మరికొన్ని భారీ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ పోటీని నాగచైతన్య ఎంతవరకు తట్టుకుంటాడో చూడాలి.

Also Read: Telangana: ఆనాడే అత్యంత ధనిక సీఎం కేసీఆర్‌.. ఆయనకు హెలికాప్టర్‌ ఎక్కడిది?

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News