Nagachaitanya responds on N-Convention: గత రెండు రోజుల నుంచి హీరో నాగార్జున నిర్మించుకున్న N - కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడంతో ఒక్కసారిగా ఈ విషయం అటు సినీ సెలబ్రిటీలను కుదిపివేసింది. ఇది తుమ్మడి కుంట చెరువును ఆక్రమించారని అనుమతి లేని ఈ నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో హైదరాబాద్ బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పైన అటు నాగార్జున ట్విట్టర్లో స్పందిస్తూ హైకోర్టు వరకు కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన నాగార్జున కుమారుడు నాగచైతన్య కూడా స్పందించడం జరిగింది.
ఇటీవలే హైదరాబాదులో ఒక వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగచైతన్యకు ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేత పైన పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో ఉన్న వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి నాగచైతన్య హాజరు కాగా అక్కడ మీడియా మిత్రులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై స్పందించాలని అడిగారు.
దీనికి నాగచైతన్య సమాధానం ఇస్తూ.. ఈ విషయం ఇప్పుడు వద్దని..N కన్వెన్షన్ ని కూల్చివేత పై ట్విట్టర్ లో అన్ని వివరాలను నాన్న గారు తెలియజేశారని తెలియజేశారు. అలాగే శోభిత గురించి, తమ వివాహం గురించి ప్రశ్నిస్తూ.. మీ వివాహం డెస్టినేషన్ లేదా హైదరాబాదులో జరుగుతుందా అని ప్రశ్నించగా.. ఇంకా వివాహం పైన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని తెలియజేశారు.
తమ పెళ్లి గురించి అన్ని వివరాలను కూడా తెలియజేశారు నాగచైతన్య.అలాగే మీరు ఎందుకు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు అని అడిగినప్పుడు, నాగచైతన్య తనను మీరే ఎక్కువగా చూపించడం వల్లే అలా కనిపిస్తున్నానని ఫన్నీగా సమాధానాన్ని తెలిపారు. ఇక తండేల్ సినిమా గురించి ప్రశ్నించగా.. ఈ లుక్ అంతా కూడా తండేల్ సినిమా కోసమే అని, ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా ఈ సినిమా తనకి ఒక సవాలుగా ఉందని తెలియజేశారు. ఈ చిత్రం ఒక రియలిస్టిక్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని వెల్లడించారు. మొత్తానికైతే ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పకుండా మిగతా విషయాలపై స్పందించి తప్పుకునే ప్రయత్నం చేశారు నాగచైతన్య.
Also Read: Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్ జైలు నుంచి విడుదల
Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.