Naga Chaitanya Tattoo Meaning: నాగచైతన్య చేతిపై టాటూది పెద్ద కథే.. సమంతతో టాటూకున్న సంబంధం ఇదేనట

Naga Chaitanya Tattoo Meaning: నాగచైతన్య చేతిపై అర్థం కాని మోర్స్ కోడ్ భాషలో ఓ టాటూ ఉంటుందనే విషయం ఆయన్ని వీడియోలలో, ఫోటోలలో కానీ లేదా దగ్గరి నుండి కానీ చూసిన చాలా మందికి తెలిసిన విషయమే. గతంలోనే చైతూ చేతిపై టాటూ ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.

Written by - Pavan | Last Updated : Aug 10, 2022, 01:43 PM IST
Naga Chaitanya Tattoo Meaning: నాగచైతన్య చేతిపై టాటూది పెద్ద కథే.. సమంతతో టాటూకున్న సంబంధం ఇదేనట

Naga Chaitanya Tattoo Meaning: నాగచైతన్య చేతిపై మోర్స్ కోడ్ రూపంలో ఓ టాటూ ఉంటుందనే విషయం ఆయన్ని వీడియోలలో, ఫోటోలలో కానీ లేదా దగ్గరి నుండి కానీ చూసిన చాలా మందికి తెలిసిన విషయమే. గతంలోనే చైతూ చేతిపై టాటూ ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇవి వైరల్ అవడానికి కారణం ఇలాంటి టాటూనే చైతూ మాజీ భార్య, ప్రముఖ హీరోయిన్ సమంత చేతిపై కూడా అదే స్థానంలో ఉండటం. అవును ఇద్దరి కుడి చేతిపై ఆ టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. 

ఇక నాగచైతన్య టాటూ వెనుక ఉన్న అసలు కథేంటి ? ఈ టాటూకు అర్థం ఏంటనే విషయమే అభిమానుల్లో చాలామందికి ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఎంతో మందికి ఓ పజిల్ గా మారిన ఈ టాటూ గురించి తాజాగా నాగచైతన్యనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీలో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లాల్ సింగ్ చద్ధా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 

లాల్ సింగ్ చద్దా మూవీ గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఇంటర్వ్యూయర్ చైతూ చేతిపై ఉన్న టాటూ గురించి ఆసక్తి కనబరుస్తూ అదేంటని అడిగాడు. దానికి చైతూ స్పందిస్తూ ఆ టాటూ మీనింగ్ ఏంటో గెస్ చేయగలరా అంటూ ఇంటర్వ్యూయర్ నే తిరిగి ప్రశ్నించాడు. ఇంటర్వ్యూయర్ తనకు తట్టిన జవాబులు ఏవేవో చెప్పినప్పటికీ అవేవి కరెక్ట్ కాకపోవడంతో చైతూనే తిరిగి కల్పించుకుంటూ అసలు విషయం చెప్పేశాడు. ఆ టాటూలో సమంతతో తన వెడ్డింగ్ డేట్ ఉంటుందని టాటూ సీక్రెట్ వెల్లడించాడు. 

తన టాటూ వెనుకున్న ఈ సీక్రెట్ తెలియకే కొంతమంది అభిమానులు ఇదే టాటూను తమ చేతిపై వేయించుకోవడం చూశానని.. కానీ అలా చేయొద్దని ఫ్యాన్స్ కి విజ్ఞప్తిచేశాడు. ఇది అందరికి సంబంధించిన విషయం కాదని.. ఇందులో తమ పెళ్లి తేదీ ఉన్నందున ఆ టాటూని వేయించుకోవద్దని చెప్పాడు. కాలంతోపాటుగా కొన్ని మారిపోతుంటాయని కూడా వ్యాఖ్యానించాడు. నాగచైతన్య టాటూ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

2017లో సమంత, నాగచైతన్యల వివాహం జరిగింది. ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు బ్యూటీఫుల్ కపుల్ అనే కితాబులు కూడా దక్కాయి. కానీ గతేడాదే చైతూ, సమంత డైవర్స్ తీసుకున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన కొన్ని విభేదాలు డైవర్స్ వరకు వెళ్లాయి. 'ఏ మాయ చేశావే' సినిమాతో మొదలైన వీళ్ల 'మజిలీ' ఎంతో అందంగా ఉంటుందనుకుంటే.. ఊహకందని విధంగా అభిమానులు అందరికీ షాకిస్తూ డైవర్స్ తీసుకున్నారు. మజిలీ మూవీలో చైతూ, సమంత మధ్య కెమిస్ట్రీ చూసిన వాళ్లు ఇప్పటికీ చైతూ, సమంతల డైవర్స్ వ్యవహరాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా నాగచైతన్య టాటూ (Naga Chaitanya tattoo trending on Google) గురించి చెప్పడంతో మరోసారి వీళ్ల మ్యారేజ్ లైఫ్, డైవర్స్ వార్తల్లోకెక్కింది.

Also Read : Bollywood Raksha Bandhan 2022: బాలీవుడ్‌‌లో సోదర సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరుల మధ్య వయస్సు తేడా ఎంతో తెలుసా

Also Read : WATCHO OTT Shows: ఇండియన్ ఆడియెన్స్‌కి వాచో ఓటిటిపై అద్దిరిపోయే కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ షోలు

Also Read : Raksha Bandhan Gifts Value: బాలీవుడ్ నటులు రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు, చెల్లెళ్లకు ఇచ్చే బహుమతుల ఖరీదు ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News