Thank you: నాగచైతన్య 'థాంక్యూ' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే..!

Naga Chaithanya: విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'థాంక్యూ'. ఈ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 04:17 PM IST
Thank you: నాగచైతన్య 'థాంక్యూ' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే..!

Thank you Movie Release date: యువ హీరో అక్కినేని నాగఛైతన్య (Naga Chaitanya), స్టార్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'థాంక్యూ'(Thank you Movie). ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌రాజు (dil raju) నిర్మిస్తున్నారు. సరికొత్త లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశిఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌లు కథానాయికలు నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహకుడుగా వ్యవహారిస్తున్నారు. బి.వి.ఎస్. రవి కథ అందిస్తున్న ఈ సినిమాలో చైతూ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు. మనం తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతూ చేస్తున్న చిత్రమిది.                                                                                                                                                                                                                                                                                                     ల‌వ్ స్టోరి, బంగార్రాజు వంటి చిత్రాలతో వరుస హిట్స్ కొట్టిన నాగఛైతన్య ఇప్పుడు ఈ చిత్రం హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఏ అప్ డేట్ రాలేదు. తాజాగా ఈ మూవీ డేట్ ను ఖరారు చేశారు మేకర్స్. జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ మేరకు నాగచైతన్య లుక్ తో ఉన్న పోస్టర్ ను ట్వీట్ చేసింది. ఇందులో నాగచైతన్య  కుర్రాడు, యువకుడు, మధ్య వయస్కుడు నటించబోతున్నాడు. అదే విధంగా ఇదే దర్శకుడితో (Vikram K Kumar) చైతూ 'ధూత' అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. 

Also Read: Sonal Chouhan : ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్ : సోనాల్ చౌహాన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News