Nagarjuna : ‘ది ఘోస్ట్‌’గా టాలీవుడ్ మన్మధుడు.. అదిరిపోయిన మూవీ ఫస్ట్ లుక్...

Nagarjuna: కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాకు ’ ది ఘోస్ట్‌’ (The Ghost) అనే టైటిల్ పెట్టారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 01:47 PM IST
Nagarjuna : ‘ది ఘోస్ట్‌’గా టాలీవుడ్ మన్మధుడు.. అదిరిపోయిన మూవీ ఫస్ట్ లుక్...

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే(Nagarjuna Birthday) సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఆయన ఫస్ట్‌లుక్‌(first look)ని రిలీజ్‌ చేశారు. ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఘోస్ట్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ‘రా’(Raw) ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రీలుక్‌తో పాటు పోస్టర్‌  సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తుంది. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్స్ హైలెట్‌గా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)హీరోయిన్‌గా నటించనుంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌(Hyderabad)లో జరుగుతుంది. కథలో భాగంగా మన దేశంలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌ (Gulpanag)నటిస్తున్నారు.

Also Read:Ichata Vahanumulu Niluparadu Review: "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమా రివ్యూ

ఇతర చిత్రాలు..
నాగార్జున ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈయన నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు(Bangarraju) అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘బంగార్రాజు’, ‘ఘోస్ట్’ సినిమాలతో పాటు నాగ్..  ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra)అనే ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), ఆలియా భట్‌(Alia Bhatt) నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ (Ayan Mukherjee)తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌(Amitabh) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం(Manam) సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News