Nagma: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్.. అవాక్కమవుతున్న ఫ్యాన్స్..

Nagma: నగ్మా ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పటి యువత కలల రాణిగా మెరిసిన ఈ భామ.. తాజాగా షాకింగ్ లుక్‌లో కనిపించి అభిమానులను బిత్తర పోయేలా చేసింది.

Last Updated : Feb 15, 2024, 12:05 PM IST
Nagma: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్.. అవాక్కమవుతున్న ఫ్యాన్స్..

Nagma: నగ్మా ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి అటు వేరే భాషల్లో రజినీకాంత్, అమితాబ్, సల్మాన్, షారుఖ్ వంటి వేరే భాషల్లోని అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్‌లో నంబర్ వన్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు ముగ్గురు స్టార్ హీరోలు.. ఓ క్రికెటర్‌తో ఎఫైర్ నడిపించింది.  ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తోంది. ఆ మధ్య కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరుపున మీరట్ తరుపున ఎంపీగా పోటీ చేసింది.

తాజాగా ఈమె ఒళ్లు చేసిన ఫోటోలు చూసిన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అసలు ఒకప్పటి మా కలల హీరోయిన్ ఈమేనా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగ్మా బయట తిరుగుతున్న ఫోటోలును కెమెరాలో క్లిక్ అనిపించారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వెంటనే ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నగ్మా గుర్తు పట్టలేనంత లావుగా మారిపోయింది.

నగ్మా విషయానికొస్తే.. 90లలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో సుమన్ హీరోగా నటించిన పెద్దింటల్లుడు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత చిరంజీవి, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘరానా మొగుడు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌ అయింది. కానీ వ్యక్తిగత జీవితం ఎపుడు హాట్ టాపిక్‌ అనే చెప్పాలి. ఈమె ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. బిహైండ్ స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్టు అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు ఓ క్రికెటర్ కూడా ఉండటం చెప్పుకోదగ్గ అంశమనే చెప్పాలి.

నగ్మా 90లలో యువత కలల రాణి. అప్ట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి అప్పటి స్టార్ హీరోలతో నటించి సత్తా చాటింది. అటు కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాల్లోనే సత్తా చాటింది నగ్మా. సినిమాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎపుగు వివాదాస్పదంగా ఉంది. ఈమె నలుగురు పెళ్లైన వాళ్లతో ఎఫైర్స్ నడిపిందనే వార్తలు అప్పట్లో సంచలనే రేపాయి. అందులో ముగ్గురు హీరోలు.. ఓ క్రికేటర్ ఉండటం విశేషం.

1974 హిందూ తండ్రికి ముస్లిమ్ అమ్మకు జన్మించింది నగ్మా. తండ్రి రాజస్థాన్ జైసల్మేర్ రాజకుటుంబానికి చెందిన వారు.  ఆ తర్వాత గుజరాత్‌కు, ముంబైకు మకాం మార్చారు నగ్మా కుటుంబం. నగ్మా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, భోజ్‌పురి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులో ఈమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేసారు. ఈమె వ్యక్తిగత జీవితం కూడా వివాదాలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం ఒంటరిగానే జీవితం లీడ్ చేస్తోంది.  

మీడియా కథనాల ప్రకారం అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గౌంగులి, అటు  శరత్ కుమార్, భోజ్ పురి హీరోలు రవి కిషన్, మనోజ్ తివారీలతో ఈమె లవ్వాయణం అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదీ చదవండి: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 7 ఫోటోస్ మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News