Amigos Trailer : నేనెవ్వరినీ బెదిరించను.. చంపేస్తానంతే.. కళ్యాణ్ రామ్ క్రూరత్వం

Nandamuri Kalyan Ram Amigos Trailer నందమూరి కళ్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇదే కేటగిరీలో ఇది వరకు ఎన్టీఆర్ జై లవకుశ అనే సినిమాను చేశాడు. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ అమిగోస్ అంటూ రాబోతోన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 06:09 PM IST
  • కళ్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్
  • మూడు పాత్రల్లో కళ్యాణ్‌ రామ్ విధ్వంసం
  • విలన్‌గా మెప్పించబోతోన్న కళ్యాణ్‌ రామ్
Amigos Trailer : నేనెవ్వరినీ బెదిరించను.. చంపేస్తానంతే.. కళ్యాణ్ రామ్ క్రూరత్వం

Nandamuri Kalyan Ram Amigos Trailer నందమూరి కళ్యాణ్‌ రామ్ అమిగోస్ అంటూ తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆల్రెడీ మైత్రీ మూవీస్ ప్రమోషన్స్‌ పెంచేసింది. ఈ క్రమంలోనే నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌లో కళ్యాణ్‌ రామ్ మూడు పాత్రలతో విధ్వంసం చేసినట్టుగా అనిపిస్తోంది. విలన్‌గా, డాన్‌గా కళ్యాణ్‌ రామ్ పోషించిన పాత్ర మాత్రం సినిమాకు హైలెట్ అయ్యేట్టు కనిపిస్తోంది.

 

ఈ ట్రైలర్‌లో ఎన్నో సీన్లు, షాట్స్, డైలాగ్స్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఎంత మందిలో ఉన్నా నిన్ను ఇట్టే కనిపెట్టేస్తాను అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో కళ్యాణ్ రామ్ డబుల్, త్రిబుల్ యాక్షన్ సీన్లు వస్తాయి. ఇక రొమాంటిక్ సీన్లు, సాంగ్‌ కూడా హైలెట్ అవుతుంది. ఎన్నో రాత్రులొస్తాయ్ అనే సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది.

అన్నింటి కంటే ముఖ్యంగా విలన్‌గా కళ్యాణ్‌ రామ్ నటించిన తీరు, చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. మనం ఫ్రెండ్స్ కాదు.. అన్నదమ్ములం అంత కంటే కాదు.. జస్ట్ మనం ఒకలా కనిపిస్తున్నాం అంతే.. అంటూ చెప్పే డైలాగ్స్.. నేను ఎవ్వరినీ బెదిరించను.. చంపేస్తాను అంతే.. అంటూ అందరినీ చంపుకుంటూ పోయే సీన్లు గూజ్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

అయితే ఇది ఎన్టీఆర్ జై లవకుశలా ఉంటుందా? లేదా? అంతకు మించి అనేలా ఉంటుందా? అన్నది చూడాలి. మరి కళ్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. జిబ్రాన్ కొట్టిన ఆర్ఆర్ ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఫిబ్రవరి 10న కళ్యాణ్‌ రామ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలానే ఉంది. అసలే ఇప్పుడు బింబిసార సక్సెస్‌లో కళ్యాణ్‌ రామ్ ఊపుమీదున్నాడు.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News