Nandamuri Ramakrishna Accident: నందమూరి రామకృష్ణ కారుకు యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

Nandamuri Ramakrishna Road Accident: నందమూరి బాలకృష్ణ సోదరుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు, ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 11, 2023, 05:54 PM IST
Nandamuri Ramakrishna Accident: నందమూరి రామకృష్ణ కారుకు యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

Nandamuri Ramakrishna Road Accident: నందమూరి కుటుంబానికి వరుస షాక్ లు తగులుతూనే వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారు. ఎన్టీఆర్ బ్రతికి ఉన్న సమయంలో ఆయన కుమారుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణ వార్త మరువక ముందే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూయగా ఈ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయి అంటూ కూడా అప్పట్లో చర్చ జరిగింది.

ఇక తాజాగా నందమూరి తారకరాత్నకి హార్ట్ స్ట్రోక్ రావడంతో ప్రస్తుతానికి ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనని మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్ట్రేలియా పంపించే ఆలోచనలో కూడా కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే తాజాగా నందమూరి అభిమానులకు షాక్ కలిగించే మరో విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే నందమూరి బాలకృష్ణ సోదరుల్లో ఒకరు ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు. నిన్న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో వెళుతుండగా రామకృష్ణ కారకు యాక్సిడెంట్ జరిగిందని అయితే ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని ప్రచారం జరుగుతోంది.

కారును రోడ్డు పక్కనే నిలిపిన రామకృష్ణ వేరే కారు పిలిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కూడా పోలీసులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. నందమూరి రామకృష్ణ కారు ప్రమాదం గురించి ప్రచారం జరుగుతుండగా ఈ విషయం మీద నందమూరి కుటుంబం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ కారు ప్రమాదానికి గురైన ప్రదేశంలో సాక్షులు నుంచి గాని ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇది నిజమా లేక కల్పితమా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే నందమూరి కుటుంబానికి వరుస ఆపదలు వస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: Shock to Rashmika: రష్మికకు పుష్ప షాక్.. ఆ దెబ్బకు కత్తిరించేశారా?

Also Read: Daksha Nagarkar Hot: వెనకి తిరిగి దక్షా హాట్ ఫోజు.. అవి తొడలా లేక వడలా అంటూ!

 
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x