Hero Nani Sister : నేనేదో పెద్ద టాలెంటెడ్ అనుకున్నా కానీ.. నాని పోస్ట్ వైరల్

Hero Nani Sister హీరో నాని సోదరి దీప్తి దర్శకురాలిగా మారిన సంగతి తెలిసిందే. మీట్ క్యూట్ అనే సినిమాతో దీప్తి ఘంటా డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 04:22 PM IST
  • నాని కొత్త సినిమా అప్డేట్
  • నిర్మాతగా నాని దూకుడు
  • నాని సోదరి దీప్తి కొత్త చిత్రం
Hero Nani Sister : నేనేదో పెద్ద టాలెంటెడ్ అనుకున్నా కానీ.. నాని పోస్ట్ వైరల్

Hero Nani Sister Meet Cute : నాని హీరోగానూ, నిర్మాతగానూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒక వైపు వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. మరో వైపు వెంటవెంటనే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాడు. అయితే తన అక్క దీప్తి ఘంటా కోసం నిర్మాతగా ముందుకు వచ్చాడు నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నాని ఇప్పుడు మీట్ క్యూట్ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ ప్రాజెక్ట్ గురించి గతంలోనే నాని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. నాని అసలే నిర్మాతగా మంచి టేస్టున్న చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నాడు.

నాని నిర్మించిన అ! సినిమా కలెక్షన్లు కురిపించకపోయినా అవార్డులు తెచ్చిపెట్టింది. ఇక HIT సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ప్రాంఛైజీలో భాగంగా HIT 2 కూడా నిర్మించేశాడు నాని. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్లో ఆ సినిమాతో రచ్చ చేసే నాని.. ఓటీటీలో మరో సినిమాతో రాబోతోన్నాడు. తన అక్క తెరకెక్కించిన మీట్ క్యూట్ సినిమాను సోనీ లివ్‌లో రిలీజ్ చేయబోతోన్నాడట.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

ఈ మేరకు మీట్ క్యూట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు నాని. హాయ్.. నేనో పెద్ద టాలెంటెడ్ అని అనుకున్నాను.. కానీ నేను ఒక టాలెంటెడ్ సిస్టర్‌కు బ్రదర్ అని తెలుసుకున్నాను.. ఆమె తెరకెక్కించిన సినిమా చూసి ఇంకా ఆ ఆశ్చర్యంలోనే ఉన్నాను.. ఎంతో గర్వపడుతున్నాను.. ఇలా ఎలా చేయగలిగిందని అనుకుంటున్నాను అంటూ రేపు ఈ మూవీ టీజర్ రాబోతోందని ప్రకటించాడు.

ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, రాజా చెంబోలు, ఆకాంక్ష సింగ్, దీక్షిత్ శెట్టి, రోహిని మొల్లేటి, శివ కందుకూరి, ఆదా శర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

Also Read : Anasuya Anchor Ravi Fun : అనసూయ ఫోన్‌ సీక్రెట్లు.. అడిగేందుకు భయపడ్డ యాంకర్ రవి

Also Read : siddhant suryavanshi Death : వర్కౌట్లు చేస్తూ జిమ్‌లో కుప్పకూలిన సిద్దాంత్.. హార్ట్ ఎటాక్‌తో యంగ్ నటుడు మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News