ప్రెజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చేశాడు.. ఈ సినిమాతో జనవరి వరకూ బిజీగా గడపనున్న త్రివిక్రమ్ ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ తర్వాత మహేష్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట త్రివిక్రమ్.
ఎన్టీఆర్ సినిమాను ఫినిష్ చేసిన వెంటనే మహేష్ తో చేయబోయే సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో కూడా మహేష్ తో 2017 లో కచ్చితంగా సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ ఈ ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ మాత్రం మహేష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడట..ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న సినిమా ఓ కొలిక్కి రాగానే వంశీ పైడి పల్లి సినిమాను స్టార్ట్ చేయాలనీ చూస్తున్న మహేష్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా త్రివిక్రమ్ తో జత కట్టే ఛాన్స్ ఉంది.