Balakrishna Golden Jubilee Celebration: బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుక.. ఆ ఇద్దరూ దూరమేనా..?

Balakrishna 50 Years Celebration: నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు యావత్ సినీ సెలబ్రిటీ లందరికీ ఆహ్వానం అందగా , ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు మాత్రం ఆహ్వానం అందలేదు అని తెలుస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 30, 2024, 11:06 AM IST
Balakrishna Golden Jubilee Celebration: బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుక.. ఆ ఇద్దరూ దూరమేనా..?

Balakrishna - Jr NTR: నటసింహ నందమూరి బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇక నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ప్రముఖులంతా కూడా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతున్నారు. 

ఈ కార్యక్రమం హైదరాబాదులో ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం జరగబోతోంది.  ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ కూడా ఆహ్వానం అందింది. అంతే కాదు శివ రాజ్ కుమార్, మమ్ముట్టి , మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. 

ఇక మెగా కుటుంబంలోని సభ్యులు అల్లు అర్జున్,  అల్లు అరవింద్ ఇలా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు . మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీని మొదలుకొని బాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కానీ సొంత ఇంటి కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను  మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు అని తెలుస్తోంది. నిజానికి మొదట్లో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ , ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.

2009 ఎన్నికల తర్వాత పార్టీకి దూరం జరిగారు ఎన్టీఆర్. అయితే దీనికి కూడా కారణం లేకపోలేదు 2009 ఎన్నికలలో జోరుగా ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ ను టిడిపి దూరం పెట్టింది. పైగా వైయస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. అంతేకాదు ఆయన అనుచరులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. 

దీంతో ఎన్టీఆర్ పైన వ్యతిరేకత ఏర్పడింది. మరొకవైపు కళ్యాణ్ రామ్ కు  ఆర్థిక సమస్యలు అన్నింటిని ఎన్టీఆర్ తీర్చేయడంతో ఎన్టీఆర్ మాట కళ్యాణ్ రామ్ జవదాటడం లేదు. అందుకే అందరికీ ఆహ్వానం అందిస్తున్నా..  వీరిద్దరికి ఆహ్వానం మాత్రం అందలేదు అని తెలుస్తోంది. మరి వీరికి ఆహ్వానం అందిందా లేదా అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే సెప్టెంబర్ ఒకటి సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: Bengal Bandh: రణరంగంగా  మారిన కోల్ కతా.. బీజేపీ కీలక నేతపై దుండగుల కాల్పులు.. వీడియో వైరల్..

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News