Poonam Kaur- Trivikram: త్రివిక్రమ్ పై లైంగిక ఆరోపణలు చేసిన పూనమ్.. నేరుగా పేరు చెబుతూ షాకింగ్ కామెంట్స్..!

Allegations on Trivikram: తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేస్ నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని , ఆ వ్యక్తి పేరు కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది పూనమ్ కౌర్ 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 17, 2024, 06:59 PM IST
Poonam Kaur- Trivikram: త్రివిక్రమ్ పై లైంగిక ఆరోపణలు చేసిన పూనమ్.. నేరుగా పేరు చెబుతూ షాకింగ్ కామెంట్స్..!

Poonam Kaur about Trivikram: తాజాగా నటి పూనమ్ కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై గతంలో ' మా ' కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. అప్పుడే త్రివిక్రమ్ పై ' మా 'చర్యలు తీసుకొని ఉండి ఉంటే, నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ సంచలన కామెంట్లు చేసింది. అంతేకాదు త్రివిక్రమ్  ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. దీంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇక అసలు విషయంలోకి వెళితే.. జూనియర్ మహిళ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. నార్సింగి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. ఒక త్వరలోనే నిజానిజాలు తేల్చే ప్రయత్నం చేస్తామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు. 

ఈ నేపథ్యంలోనే పూనమ్ కౌర్ ధైర్యంగా.. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా త్రివిక్రమ్ తనను లైంగికంగా హింసించాడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొద్ది రోజులుగా గురూజీ అంటూ త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన ఈమె,  పవన్ కళ్యాణ్ పైన కోపంతోనే ఇతడిని టార్గెట్ చేసింది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే త్రివిక్రమ్ ను పూనమ్ కౌర్ ఎన్ని రకాలుగా , ఎన్ని మాటలు మాట్లాడిన సరే ఆయన ఏ రోజు కూడా స్పందించలేదు.

అయితే ఇప్పుడు నేరుగా త్రివిక్రమ్ ను  టార్గెట్ చేస్తూ పూనం చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. బయటికి పెద్దవారిగా చెప్పుకునే వీరంతా లోపల ఆడవారిని ఇంత హింసిస్తున్నారా అంటూ నెటిజన్స్ నిట్టూరుస్తున్నారు. మరి దీనిపై త్రివిక్రమ్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. 

పూనం కౌర్ విషయానికి వస్తే.. తెలుగులో మాయాజాలం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె, ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినా, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెడుతూ అటు పవన్ కళ్యాణ్,  ఇటు త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే

Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News