OG: ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

OG release date poster out: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 05:08 PM IST
OG: ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

OG update: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ చిత్రంపై మెగా అభిమానులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమధ్య ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. తాజాగా ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ని పోస్టర్ తో సహా విడుదల చేశారు మేకర్స్.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బిజీగా ఉండటంతో ఓజీ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న కొన్ని సినిమాలు షూటింగ్ కూడా ఆపుకునేసాయి. దాంతో పవన అభిమానులు ఓజీ సినిమా కూడా ఎక్కడ ఆగిపోతుందో అని భయపడ్డారు. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నామంటూ ఈరోజు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండొచ్చు. అయితే ఆ ఎలక్షన్స్ అవ్వగానే పవన్ ఓజీ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024 విడుదల చేస్తామంటూ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా ఉండే ఒక పోస్టర్ ని విడుదల చేశాడు.  కూలింగ్ గ్లాసులు పెట్టుకొని.. చేతిలో టీ గ్లాస్ పట్టుకొని.. కారు ముందు పవన్ కళ్యాణ్ నిలబడిపోయిన పవన్ కళ్యాణ్ ని మనం ఈ పోస్టర్లో చూడొచ్చు.

ప్రస్తుతం ఈ పోస్టర్ ని ఆయన అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. కాగా ఇందులో మరో ప్రత్యేకత ఏమిటి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా 2013లో సెప్టెంబర్ 27వ తేదీనే విడుదలైంది. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది.  దీంతో అదే సెంటిమెంట్‍తో ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ 27న ఓజీని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారని అందుకే ఆ తేదీనే ఖరారు చేశారని వినిపిస్తోంది. మరి ఈ సినిమా కూడా ఆ చిత్రం రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో వేచి చూడాలి.

Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..

Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News