Pawan Kalyan: సినిమాలన్నిటికీ నేను డేట్స్ ఇచ్చాను.. వాళ్లే సద్వినియోగం చేసుకోలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..!

Pawan Kalyan Update: పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన నుంచి వచ్చే అన్ని సినిమాల గురించి క్లారిటీ ఇస్తూ చెప్పిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.  అన్నిటికన్నా ముఖ్యంగా తను డేట్స్ ఇచ్చాను అని కానీ.. సినిమా వారే సద్వినియోగం చేసుకోలేకపోయారని పవన్ అన్న మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 30, 2024, 05:05 PM IST
Pawan Kalyan: సినిమాలన్నిటికీ నేను డేట్స్ ఇచ్చాను.. వాళ్లే సద్వినియోగం చేసుకోలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..!

Pawan Kalyan OG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా మారిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ కి  డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వేగంగా పనులు చేస్తూ ప్రజల కష్టాలు తీరుస్తూ ముందుకు వెళుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన ప్రకటించిన సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 

అయితే తమ అభిమాన హీరో నుండి సినిమా రావడం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పబ్లిక్ లో ఎక్కడ స్పీచ్ ఇచ్చినా సరే OG, OG అంటూ అరుస్తూ ఆయనను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్న జరిగిన ఒక సమావేశంలో అభిమానులు ఇలా అరవడంతో అసలు మీరు అభిమానులేనా?  ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా? అంటూ తన అభిమానుల పైన ఫైర్ అయ్యాడు. 

అయితే ఇప్పుడు మరొకసారి అభిమానులు అలాగే చేయడంతో అభిమానుల కోరికలను దృష్టిలో పెట్టుకున్న ఆయన తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అమరావతి వేదికగా పవన్ కళ్యాణ్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఓజీ సినిమా స్టోరీ 1980,90s లో జరిగే కథ..OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. OG OG అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి..

“నేను చేయాల్సిన మూడు సినిమాలకు ఎప్పుడో డేట్స్ ఇచ్చాను. కానీ ఆ డేట్స్ ను  ఆ సినిమా బృందాలు సరిగా సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది.అన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తాను,” అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. 

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.  ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం. జనవరి 4వ తేదీన రాజమండ్రిలో ఓపెన్ గ్రౌండ్లో జరగబోయే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు

Read more: Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ ఫోక్ సాంగ్..?.. ఇంత సైకోయిజమా అంటున్న బన్నీ ఫ్యాన్స్.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News