గుండెల్ని పిండేసే పెనివిటి ఫుల్ సాంగ్ వీడియో

గుండెల్ని పిండేసే పెనివిటి ఫుల్ సాంగ్ వీడియో  

Last Updated : Dec 23, 2018, 11:33 AM IST
గుండెల్ని పిండేసే పెనివిటి ఫుల్ సాంగ్ వీడియో

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అరవింద సమేత సినిమా ఓ ప్రత్యేకం. పర్‌ఫార్మెన్స్ పరంగా తానేంటో ఎప్పుడో నిరూపించుకున్న తారక్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లిన సినిమా ఇది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డె జంటగా నటించగా జగ్గూభాయ్ జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన జగపతి బాబు సైతం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ... ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమే అని అభిప్రాయపడ్డారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్, సెంటిమెంట్ సన్నివేశాలు ఆడియెన్స్‌ని కదిలిస్తాయి, ఆలోచింపచేస్తాయి. అందుకు తగినట్టే పాటలు సైతం మధ్యమధ్యలో కథలో భాగంగానే వచ్చిపోతుంటాయి. అలా కథలో భాగంగా తన తండ్రిపై తన తల్లి పెంచుకున్న ప్రేమను ఎన్టీఆర్ పాడే పాటే ఈ పెనివిటి సాంగ్. ఆడియెన్స్‌ని సినిమాకు మరింత బాగా కనెక్ట్ అయ్యేలా చేసిన పెనివిటి సాంగ్ వారి గుండెల్ని పిండేసింది. తాజాగా అరవింద సమేత మూవీకి మ్యూజిక్ పార్టనర్ అయిన జీ మ్యూజిక్ సౌత్ కంపెనీ తమ యూట్యూబ్ చానెల్ ద్వారా పెనివిటి ఫుల్ సాంగ్ వీడియోను విడుదల చేసింది.

Trending News