Pooja Hegde : సౌత్ లో డిజాస్టర్స్... బాలీవుడ్ లో మాత్రం భారీ ఆఫర్లు..

Pooja Hegde Upcoming Movies: ఆచార్య, రాధే శ్యామ్ వంటి డిజాస్టర్ సినిమాల తర్వాత.. అప్పటిదాకా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ పూజా వరస సినిమా ఆఫర్లతో బిజీ అవుతోంది అని వినికిడి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2024, 11:27 AM IST
Pooja Hegde : సౌత్ లో డిజాస్టర్స్... బాలీవుడ్ లో మాత్రం భారీ ఆఫర్లు..

Pooja Hegde : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత పూజ హెగ్డే కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరీర్ లో బాగానే ముందుకు దూసుకుపోయింది పూజ హెగ్డే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది ఈ భామ.

కానీ గత కొంతకాలంగా ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు ఈమె నటిస్తున్న సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్లు అవుతూ వస్తూ ఉండడంతో పూజకి కొత్త ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. ఆచార్య, రాధే శ్యామ్ వంటి సినిమాలు డిజాస్టర్లు అవడం పూజ హెగ్డే కెరీర్ కు పెద్ద దెబ్బగా మారింది.

మహేష్ బాబు సరసన నటించాల్సిన గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి ఆమె స్వయంగా తప్పుకుంది. అయితే ఇక పూజ హెగ్డే కి ఆఫర్లు తగ్గిపోతున్నాయా అని అనుకునే సమయానికి మళ్లీ ఇప్పుడు ఆమెకు కొత్త అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపికైందట. ఇప్పటికే అల్లు అర్జున్ తో డీజే, అల వైకుంఠ పురములో వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ భామ ఇప్పుడు మళ్లీ బన్నీ సినిమాతోనే మరొక సూపర్ హిట్ అందుకుంటుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోపక్క టాలీవుడ్ నుంచి ఆఫర్లు తగ్గిన వెంటనే పూజ హెగ్డే బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంది.  ఇప్పటికి కూడా బాలీవుడ్ లో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది. సౌత్ లో డిజైన్ తెచ్చుకున్న కాని బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోల ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

రోషన్ అండ్రూస్ తెరకెక్కిస్తున్న దేవా సినిమాలో ఈమె ఇంతవరకు ఎప్పుడూ కనిపించని ఒక పాత్రలో సందడి చేయబోతోంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఈ మధ్యనే పూజ హెగ్డే కూడా పాల్గొంది. షాహిద్ కపూర్ సరసన నటిస్తున్న ఈ సినిమాతో పాటు పూజ హెగ్డే కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా, ఆహాన్ శెట్టితో మరొక సినిమా ను కూడా సైన్ చేసింది. ఇవే కాకుండా మరిన్ని అవకాశాలు కూడా బాలీవుడ్ లో పూజా తలుపు తడుతున్నట్టు వినికిడి.

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News