MS Dhoni meets Specially-Abled Fan Lavanya Pilania at Ranchi Airport: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ హిస్టరీలో మంచి బ్యాటర్, ఫినిషర్ మాత్రమే కాకూండా.. అత్యుత్తమ కెప్టెన్ కూడా. క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలను (టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడమే కాకుండా.. భారత క్రికెట్ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చారు. అందుకే మిస్టర్ కూల్‌గా పేరు సంపాదించుకున్న ధోనీకి ఎందరో అభిమానులు ఉన్నారు. భారత్‌లో అయితే మహీని కలవడానికి ఏకంగా సెక్యూరిటీని దాటి మైదానంలోకి వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
బారికేడ్లు దాటి తనను కలవడానికి మైదానంలోకి వచ్చిన అభిమానులను ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ఏమీ అనడు. తనకు షేక్ హ్యాండ్ లేదా హగ్ ఇచ్చి పంపిస్తాడు. అయితే తాజాగా ఓ అభిమానిని స్వయంగా కలిసాడు మహీ. రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో ధోనీ తన అభిమానిని కలుసుకొని ఆమెను సంతోష పరిచాడు. ఆ అభిమాని పేరు లావణ్య పిలానియా. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్న లావణ్యకు మహీ అంటే ఎనలేని అభిమానం. అంగవైకల్యం ఉన్నా మహీ బొమ్మను గీసి అతనికి కానుకగా ఇవ్వాలని ఎప్పటినుంచో చూస్తోంది.
విషయం తెలుసుకున్న ఎంఎస్ ధోనీ.. మిలటరీ క్యాంప్స్ కోసం రాంచీ వచ్చి మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో లావణ్యను స్వయంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా లావణ్య తాను గీసిన బొమ్మను తన అభిమాన క్రికెటర్‌కి చూపించింది. ఆపై భావోద్వేగం చెందడంతో లావణ్య చేతులను దగ్గరికి తీసుకుని.. కన్నీళ్లను తుడిచాడు మహీ. తన బొమ్మ గీసినందుకు అభినందించడంతో లావణ్యకు తెగ సంబరపడిపోయింది. ఈ విషయాన్ని లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అంతేకాదు ధోనీతో పోటోలను పోస్ట్ చేసింది.
'నేను ఎంఎస్ ధోనీని కలిసాను. చాలా సంతోషంగా ఉంది. మహీ నా చేతులు తడుముతూ ఏడ్వకూడదని చెప్పారు. జీవితాన్ని ఆనందంగా గడపాలని పేర్కొన్నారు. తన బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారు. మహీ నా కోసం విలువైన సమయాన్ని కేటాయించారు. నువ్వు సంతోషంగా ఉన్నావా? అని ధోనీ భయ్యా నన్ను అడిగినప్పుడు నా దగ్గర రియాక్షన్ లేదు. ఎందుకంటే ఆయన మాటలు విలువ కట్టలేనివి' అని లావణ్య ట్వీట్ చేశారు.
Also Read: Vijayawada: విజయవాడలో గ్యాంగ్ వార్.. ఫుట్‌బాల్ ప్లేయర్‌ను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
MS Dhoni Fan: ఎంఎస్ ధోనీ అంటే ఇదే.. అభిమానిని కలిసి కన్నీళ్లు తుడిచిన మహీ!
ఎంఎస్ ధోనీ అంటే ఇదే
అభిమానిని కలిసి కన్నీళ్లు తుడిచిన మహీ
నువ్వు సంతోషంగా ఉన్నావా?