Positive Reports from Ranga Marthanda special show: మరాఠీ భాషలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన నట సామ్రాట్ అనే సినిమాని తెలుగులో విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరాఠీలో నానాపటేకర్ నటించిన పాత్రలో తెలుగులో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న కొంత మంది సెలబ్రిటీలకు ఈ సినిమాని చూపించారు.
యువ దర్శకులకు, సీనియర్ పాత్రికేయులకు స్పెషల్ షో వేశారు ఇక ఈ స్పెషల్ షో చూసిన వారంతా సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ మళ్లీ కృష్ణవంశీ హిట్ కొట్టబోతున్నారు అంటూ సినిమా అద్భుతంగా ఉందనే కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం నటన సినిమాలోని డైలాగులు గుండెకు హత్తుకుంటాయని కచ్చితంగా ఈ సినిమాతో కృష్ణవంశీ హిట్ అందుకుంటారని కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మాత్రమే కాదు సినిమాలో నటించిన ఇతర పాత్రధారులు రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు కూడా తమ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారంటూ సినిమా చూసినవారు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి నటసామ్రాట్ సినిమా పూర్తిగా నాటక రంగం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఈ రంగమార్తాండ సినిమాని మాత్రం అమ్మానాన్నల ప్రాముఖ్యత పిల్లలు వారితో ఎలా గడపాలి ఎలా గడిపితే వారు ఆనందంగా ఉంటారు అనే అంశాలను కూడా స్పృశిస్తూ సాగింది. ఇక రంగమార్తాండ సినిమా ఒక ఎంగేజింగ్ ఫ్యామిలీ ఫిలిం అని ఇళయరాజా అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లాయని అంటున్నారు..
ఇక ఈ రంగమార్తాండ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అందించిన మూడున్నర నిమిషాలు షాయరి కూడా అద్భుతంగా కుదిరిందని తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన నటులను ప్రస్తుతం సత్తా చాటుతున్న నటులను చూపిస్తూ వారికి ఒక ట్రిబ్యూట్ లాగా చేసిన షాయరి ఇప్పుడు ఆకట్టుకుంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కచ్చితంగా ఈ సినిమాతో కృష్ణవంశీ మరో హిట్టు కొట్టారని, సినిమా చూసిన వారంతా ఘంటాపధంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Naresh Clarity on Marriage: పవిత్ర పెళ్లిపై తొలిసారి స్పందించిన నరేష్.. మామూలుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి