Prabhas Project K: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' షూట్ రీస్టార్ట్... రెబల్ స్టార్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ...

Prabhas Project K Updates: చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్... ప్రస్తుతం ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 09:37 AM IST
  • ప్రభాస్ ప్రాజెక్ట్ కె అప్‌డేట్స్
  • హైదరాబాద్‌లో స్టార్ట్ అయిన మరో షెడ్యూల్
  • షూటింగ్‌లో జాయిన్ అయిన ప్రభాస్
Prabhas Project K: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' షూట్ రీస్టార్ట్... రెబల్ స్టార్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ...

Prabhas Project K Updates: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తాజాగా మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా షెడ్యూల్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రభాస్‌తో పాటు పలువురు నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10 వరకు ప్రాజెక్ట్ కె షూటింగ్ అదే సెట్‌లో జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత కొంత గ్యాప్‌తో మరో షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో నాగ అశ్విన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్, దీపికా పదుకొణే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె'లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై చూడని కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు అశ్విన్ చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేక వాహనాలు తయారుచేసి ఇవ్వాల్సిందిగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.

Also Read: Horoscope Today May 2 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్..

Also Read: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్‌మెంట్... సొంత రాజకీయ పార్టీపై నేడే ప్రకటన...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News