Horoscope Today May 2 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్...

Horoscope Today  May 2 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. పెద్దల ఆశీస్సులు వారిని ముందుకు నడిపిస్తాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 07:10 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ ఆజానకమైన ఫలితాలు
  • చంద్రుడి అనుగ్రహం, పెద్దల ఆశీస్సులు కొన్ని రాశుల వారికి కలిసొస్తాయి
  • ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయో తెలుసుకోండి
Horoscope Today May 2 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్...

Horoscope Today May 2 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. చంద్ర అనుగ్రహం లేని రాశుల వారు పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. లేనిపక్షంలో నష్టాలను చవిచూస్తారు.  కొన్ని రాశుల వారు తమ జీవిత సహచరితో రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి... 

మేషరాశి ( Aries)

ముక్కు సూటితనాన్ని నియంత్రించుకుంటారు. ఇదివరకు ముక్కుసూటితనం కారణంగా లేని సమస్యలను ఎదుర్కోవడం మీకు గుణపాఠం అవుతుంది. ఇంటికి మరమత్తులు చేపడుతారు. ఇంటికి సంబంధించిన వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేస్తారు. సోషల్ ఈవెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు. అది మీ నెట్‌వర్క్ పరిధిని విస్తృతం చేస్తుంది. ఫ్యామిలీ బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతారు.

వృషభ రాశి (Taurus)

ఇవాళ చంద్రుడి మీకు చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి గాఢ నిద్ర తర్వాత మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం మొదలుపెడుతారు. చంద్ర అనుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ధృఢపరుస్తుంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేసేందుకు వెనుకాడరు. అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. మీ జీవిత సహచరితో కాస్త రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. 

మిథున రాశి (GEMINI)

ఇవాళ మిమ్మల్ని అంతృప్తి వెంటాడుతుంది. రోజంతా మూడీగా, నిరాశలో ఉంటారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఫలితంగా మీ రోజు వారీ పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. మరింత నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. అయినప్పటికీ సహనాన్ని కోల్పోవద్దు. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవింగ్స్‌కి దూరంగా ఉండటం మంచిది. ప్రేమికులు బ్రేకప్ చెప్పుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ వ్యాపారం పరంగా బాగా కలిసొస్తుంది. ఊహించని విధంగా ఒక బిగ్ ఆర్డర్ మీకు అందుతుంది. అది మీ వ్యాపారాన్ని పురోగతి చెందేలా చేస్తుంది. ఓ వ్యక్తి కారణంగా వ్యాపారంలో మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి వారు కోరుకునే జాబ్ లభిస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో రొమాంటిక్‌గా గడుపుతారు. 

సింహ రాశి (LEO)

వ్యాపార పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. పని భారం కారణంగా మానసికంగా అలసిపోతారు. బంధువుల్లో ఒకరి ఫంక్షన్‌కు వెళ్లలేకపోతారు. లేదా ఆలస్యంగా వెళ్తారు. అది మీ బంధువులకు లేదా కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. దాని కారణంగా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ, లేదా వ్యాపార రీత్యా మాత్రం పూర్తి అనుకూలంగా ఉంటుంది. మీ పని తీరుకు ఇతరుల నుంచి అభినందనలు దక్కుతాయి.

కన్య రాశి (Virgo)

పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. గత వారం ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ఇదివరకు ఆగిపోయిన మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఆటోమేటిగ్గా మళ్లీ షురూ అవుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు.

తులా రాశి (Libra)

ఇవాళ చంద్రుడి నెగటివ్ ప్రభావం మీపై ఉంటుంది. అది మిమ్మల్ని నిరాశపరుస్తుంది. రోజంగా నిరాశజనకంగా సాగేలా చేస్తుంది. అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఇదివరకు వ్యాపారంలో వచ్చిన లాభాలు ఇప్పుడు నష్టాలుగా మారుతాయి. కొద్దిరోజుల వరకు పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. జీవితంలో కొన్ని వాస్తవాలను ఇప్పుడిప్పుడే గమనించడం మొదలుపెడుతారు.

వృశ్చిక రాశి (Scorpio)

చంద్ర అనుగ్రహం ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ కొలిగ్స్ కన్నా మెరుగైన పనితీరుతో బాస్ ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ రీత్యా ప్రమోషన్‌కు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius)  

మీ వాక్చుతుర్యం మీకు చాలా అంశాల్లో కలిసొస్తుంది. మాట తీరుతోనే చాలా సమస్యలను పరిష్కరించుకోగలరు. మీ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునేందుకు కొన్ని కోర్సులు చేస్తారు. అది మీ కెరీర్‌కు బలమైన పునాది వేస్తుంది. ప్రేమికులు పెళ్లి విషయంలో తొందరపడవద్దు. అదే సమయంలో ఒకరి పట్ల ఒకరు పూర్తి నమ్మకంతో ఉండేలా ముందుకు సాగాలి. ప్రత్యర్తులు మీ జోలికి రారు.

మకర రాశి (Capricorn) 

ఇవాళ మీకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టుల్లో ఏ డాక్యుమెంట్‌పై సంతకం పెట్టాలన్నా.. ముందు దాన్ని క్షుణ్ణంగా చదవండి. హడావుడిగా సంతకం పెట్టేసి ఆ తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. రిస్క్‌తో కూడిన స్థిరాస్తి పెట్టుబడులు నష్టాలు కలిగించే అవకాశం ఉంది. కొద్దిరోజుల పాటు పెట్టుబడులను వాయిదా వేసుకుంటే మంచిది.

కుంభ రాశి (Aquarius)

చంద్ర అనుగ్రహం మీకు కలిసొస్తుంది. మీ చుట్టూ మీకు చేటు చేసే వ్యక్తులు ఉన్నప్పటికీ మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని నిలబెడుతుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో కాస్త భావోద్వేగపూరితంగా ఉంటారు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మీ అంతరంగం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. కీలక విషయాల్లో మీ అంతరంగం చెప్పేది వినండి. 

మీన రాశి (Pisces) 

చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. బిజినెస్‌లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తి చేయడంలో మీ కొలిగ్స్ సహకారం ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి తగాదాలను పరిష్కారమవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సానుకూల సమయం. ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది. 

Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్‌మెంట్... సొంత రాజకీయ పార్టీపై నేడే ప్రకటన...

Also Read: Kili Paul Attack: ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్‌పై దుండగుల దాడి.. కత్తితో పొడిచి, కర్రలతో కొట్టి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News