Prabhas-Rajamouli Combo: రాజమౌళితో మరో సినిమా చేయబోతున్న ప్రభాస్

రాజమౌళి- ప్రభాస్ క్రేజీ కాంబోలో మరో సినిమా రానుందని చాలా రోజుల నుండి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నిజం చేస్తూ 'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళితో సినిమా చేసే గురించి అప్డేట్ ఇచ్చేసారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 02:11 PM IST
  • రాజమౌళి-ప్రభాస్ కాంబోలో మరో సినిమా
  • సీక్రెట్ రివీల్ చేసిన హీరో ప్రభాస్
  • ఇద్దరి కాంబోలో తొందరలో తెరకేక్కన్న సినిమా
Prabhas-Rajamouli Combo: రాజమౌళితో మరో సినిమా చేయబోతున్న ప్రభాస్

Prabhas-Rajamouli Combo: హీరో ప్రభాస్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. రాజమౌళి దర్శకత్వం 
వచించిన బాహుబలి పార్ట్-1, పార్ట్-2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటు రాజమౌళి, అటు ప్రభాస్ సినిమాల గురించి దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

రాజమౌళి- ప్రభాస్ కాంబోలో మూడో సినిమా రాబోతుందనే వార్తలు సినీ ఇండస్ట్రీలో ప్రచారంజరుగుతూనే ఉంది. అయితే తాజాగా ప్రభాస్ కూడా దీనిపై నోరు విప్పటంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. హీరో ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. రాజమౌళి -నేను మంచి సన్నహితులం.. తరచుగా వ్యక్తిగత మరియు సినిమా విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటాం.  రాజమౌళితో సినిమా చేయటానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటానని తెలుసు. మా ఇద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతుంది కానీ అదెప్పుడో ఇంకా చెప్పలేను. మా ఇద్దరి దగ్గర ఒక ప్లాన్ ఉంది. వీలైనంత త్వరలో అది రూపుదిద్దుకోవచ్చు" అని ప్రభాస్ ఫాన్స్ కి కిక్కిచ్చే వార్త అందించారు. 

ఇదిలా ఉండగా ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్ లలో బిజీగా ఉండగా.. నిన్న బుధవారం రోజున రెండవ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధ కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ మరో రెండు 'సాలార్', 'ఆదిపురుష్' వంటి పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మార్చి 25 వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుండగా.. రాజమౌళి తరువాత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్- రాజమౌళి  కాంబోలో వచ్చే తరువాత సినిమాకి చాలా సమయం పట్టేలా ఉందని ఇండస్ట్రీ టాక్.

Also Read: AP Rain Forecast: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

Also Read: Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ వందో టెస్ట్‌లో వంద కొట్టాలి.. నేను మ్యాచ్‌ చూసేందుకు వస్తున్నా: గంగూలీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News