Prabhas Maruti Movie: ప్రభాస్-మారుతి మూవీ.. షూటింగ్, రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Prabhas-Maruti Movie Update: ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెర పైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవనుందంటే... 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 12:03 PM IST
  • ప్రభాస్-మారుతి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
  • సినిమా షూట్, రిలీజ్ విషయంలో క్లారిటీ
  • పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి
Prabhas Maruti Movie: ప్రభాస్-మారుతి మూవీ.. షూటింగ్, రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Prabhas-Maruti Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్, హాస్య చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌గా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది... సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. తాజాగా వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో సినిమా షూట్, రిలీజ్ విషయంలో కాస్త క్లారిటీ వచ్చేసింది.

తాజా అప్‌డేట్ ప్రకారం... ప్రభాస్-మారుతి సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో భాగంగా మారుతి అండ్ టీమ్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్‌తో... అటు కామెడీ, ఇటు మాస్ సన్నివేశాలను బ్యాలెన్స్ చేస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ మారుతి సినిమాను పట్టాలెక్కించనున్నారు. ప్రభాస్ చివరి రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో అర్జంటుగా ఒక హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. అప్‌కమింగ్ సినిమాలు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ప్రభాస్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

Also Read: Flipkart Realme 8S 5G: రూ.5 వేలకే Realme 8S 5G స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!

Shashi Tharoor: ఉమ్రాన్‌కు ఫిదా అయిన శశిథరూర్, టీమ్ ఇండియాలో తీసుకోవాలంటూ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News