Shashi Tharoor: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడొక సంచలనంగా మారాడు. నెట్ బౌలర్ నుంచి చరిత్ర సృష్టించిన బౌలర్‌గా అందరి దృష్టి ఆకర్షించాడు. ఇప్పుడు కొత్తగా మరో రాజకీయనేత అతడికి ఫిదా అయ్యారు..
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన ఎస్ఆర్‌హెచ్ ఆ తరువాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లు దక్కించుకుంది. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ జట్టుకు కీలక బౌలర్‌గా మారిన కశ్మీర్ యువకుడు ఉమ్రాన్ మాలిక్ అందరి దృష్టీ ఆకర్షిస్తున్నాడు. ఉమ్రాన్ విసురుతున్న అత్యంత వేగమైన బాల్స్‌కు బ్యాటర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో పడుతున్నాయి ఆ బాల్స్.
ఇదంతా ఓ ఎత్తైతే ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్ మరో ఎత్తు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 20వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ అందర్నీ ఫిదా చేసేశాడు. ఆ ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించడమే కాకుండా మూడు వికెట్లు తీశాడు. టీ20లో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మెయిడెన్ కావడమంటే మాటలు కాదు. ఆ ఘనత ఇప్పటి వరకూ ముగ్గురు సాధించారు. ఒకరు ఇర్ఫాన్ పఠాన్, రెండవది మలింగా కాగా...మూడవ వ్యక్తి ఉనాద్కట్. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ ఆ ఘనత సాధించిన నాలుగవ వ్యక్తి. అయితే ఉమ్రాన్ మరో ఘనత సాధించాడు. ఆ ముగ్గురూ కేవలం మెయిడెన్ ఓవర్ చేస్తే..ఉమ్రాన్ మాలిక్ అదే ఓవర్‌లో మూడు వికెట్లు కూడా తీశాడు. ఈ ఘనత ఇప్పటివరకూ ఎవరూ సాధించనిది. మరెవరూ సాధించలేనిది కూడా కావచ్చు.
ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఎంట్రీ ఇచ్చి గంటకు 151 కిలోమీటర్ల వేగంతో బంతులేసి..బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అందుకే ఈసారి వేలానికి ముందే 4 కోట్లతో ఎస్ఆర్‌హెచ్ జట్టు రిటైన్ చేసుకుంది.
అందుకే ఇప్పుడీ స్పీడ్ పేసర్‌పై పలువురు మాజీ క్రికెటర్లు, రాజకీయ నేతలు కూడా ఫిదా అవుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం ఉమ్రాన్ మాలిక్‌కు ఫిదా అయ్యారు. అతడిలో ఉడుకురక్తం ఉరకలేస్తోందని..త్వరలో టీమ్ ఇండియాలో తీసుకోవాలని కోరారు. టెస్ట్ మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ తీసుకెళ్లి..బుమ్రాతో కలిసి బౌల్ చేస్తే ఆంగ్లేయులు బెంబేలెత్తిపోతారని ట్వీట్ చేశారు.
We need him in India colours asap. What a phenomenal talent. Blood him before he burns out! Take him to England for the Test match greentop. He and Bumrah bowling in tandem will terrify the Angrez! #UmranMalik https://t.co/T7yLb1JapM
— Shashi Tharoor (@ShashiTharoor) April 17, 2022
Also read: Umran Malik: నెట్ బౌలర్ నుంచి చరిత్ర సృష్టించిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ ప్రస్థానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook