Prabhas Salaar 2: ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా.. ఉండే హీరో ఎవరు అంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్ ఈ మధ్యనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వచ్చిన కల్కి 2898 ఎడి..సినిమా ద్వారా మంచి విజయం అందుకున్నారు. కాగా ఈ సినిమా కన్నా ముందు విడుదలైన సలార్ సినిమా కూడా ప్రభాస్ కి..మంచి విజయాన్ని అందించింది. కాగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ లో.. ప్రభాస్ నటించాల్సి ఉండగా.. ప్రస్తుతం సలార్ సీక్వెల్..గురించి ఒక చేదువార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ఇందుకు ముఖ్య కారణం.. నిన్న సలార్ దర్శకుడు ప్రశాంత్ నిల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా మొదలు కావడం. దీంతో ప్రభాస్ అభిమానుల్లో..
సలార్ 2 శౌర్యంగపర్వం సినిమా గురించి అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్..కనీసం మరో సంవత్సరం పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు మీదే ఉంటాడు. ఈ సినిమాని 2026 సంక్రాంతికి విడుదల చేయాలి అని గట్టిగా.. ఫిక్స్ అయ్యారంట ప్రశాంత్ నీల్.
కానీ అలా జరగాలంటే ఈ దర్శకుడు.. కేవలం 6 నెలల్లో ఈ సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది.. ఎందుకంటే ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ కి నెలల తరబడి సమయం అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 2026.. సంక్రాంతికి రెడీ అయిపోయి విడుదలవుతుంది అనే నమ్మకం చాలా మందిలో లేదు. ప్రస్తుతానికి సినిమా యూనిట్.. 2026 సంక్రాంతిని లాక్ చేసుకున్నారు కానీ ఇదంత సులభం కాదు.
కాగా ఈ సినిమా కానీ ఆలస్యమైతే.. ఇక తప్పకుండా ప్రభాస్ సలార్ 2 సినిమా మరింత ఆలస్యం అవుతుంది. నిజానికి ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో.. జగపతిబాబు, బాబీ సింహ లాంటి ఆర్టిస్టులు మాట్లాడుతూ.. త్వరలోనే సలార్ సీక్వెల్.. మొదలవుతుంది అని నమ్మకం ఇచ్చారు.
కానీ అలాంటిదేమీ ఇప్పుడల్లా జరిగేలా లేదు.
సలార్1కి.. కెజిఎఫ్ స్థాయి స్పందన దక్కకపోవడంతో.. ప్రశాంత్ ..ఈ చిత్రం సీక్వెల్ పైన..అంత కాన్సెంట్రేట్ చెయ్యట్లేదు అని వినికిడి. అయితే సలార్ చిత్ర నిర్మాతలు మాత్రం.. ప్రభాస్ రేంజ్ గుర్తు పెట్టుకొని సెకండ్ పార్ట్ తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. అని అనుకుంటున్నారట.
మరో పక్క ప్రభాస్ చేతిలో నిండుగా సినిమాలు ఉన్నాయి ..కాబట్టి ఒకవేళ ప్రశాంత్ గాని.. సలార్ పైన కాన్సెంట్రేట్ చెయ్యకపోతే.. ప్రభాస్ కూడా దానిని పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి క్రమంలో అసలు సలార్ 2..పరిస్థితి ఏమిటి అనేది ఎంతో మందికి ఉన్న సందేహం.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్ వివేకా హత్యపై కీలక పరిణామం
Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి