Prabhas with Siddharth Anand: మరో పాన్ ఇండియా మూవీకు సిద్ధమౌతున్న ప్రభాస్

Prabhas with Siddharth Anand: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన ప్రభాస్‌తో..మరో బాలీవుడ్ సినిమా తెరకెక్కబోతోంది. వార్ సినిమాతో  సంచలనమైన సిద్ధార్ధ్ ఆనంద్..ప్రభాస్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం..

Last Updated : Jan 31, 2021, 02:24 PM IST
Prabhas with Siddharth Anand: మరో పాన్ ఇండియా మూవీకు సిద్ధమౌతున్న ప్రభాస్

Prabhas with Siddharth Anand: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన ప్రభాస్‌తో..మరో బాలీవుడ్ సినిమా తెరకెక్కబోతోంది. వార్ సినిమాతో  సంచలనమైన సిద్ధార్ధ్ ఆనంద్..ప్రభాస్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం..

బాహుబలి ( Bahubali ) ఫేమ్ ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ హీరోగా మారిపోయాడు. బాలీవుడ్ ( Bollywood ) దర్శకులంతా ప్రభాస్ ( Prabhas )‌పై దృష్టి పెట్టారు. పాన్ ఇండియా హీరోగా మారడంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యాడు ప్రభాస్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ( KGF Director Prashat neel ) తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ఆదిపురుష్ ( Adi purush ) సినిమా పనులు  జరుగుతున్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ దర్శకుడు ప్రభాస్‌తో చర్చలు జరిపాడు. 

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కధనాయకులుగా బాక్సాఫీసులో కలెక్షన్ల రికార్డు సృష్టించిన వార్ సినిమా ( war Movie ) దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ ( Siddharth Anand ) ప్రభాస్‌తో సినిమాకు రంగం సిద్ధం చేశాడు. ప్రభాస్ కోసం పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేసి ఒప్పించినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా భారీ వ్యయంతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ కూడా చేయబోతున్నారు. 

Also read: RRR Actress Olivia Morris Birthday: ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఫస్ట్‌లుక్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News