Prakash Raj resignation: రాజీనామా విషయంలో మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కండిషన్

Prakash Raj to withdraw his resignation from MAA: మా అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మరునాడే అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 04:17 PM IST
  • మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్న మంచు విష్ణు
  • తన రాజీనామా ఉపసంహరణపై స్పందించిన ప్రకాశ్ రాజ్
  • తన రాజీనామా ఉపసంహరణకు షరతు విధించిన ప్రకాశ్ రాజ్
Prakash Raj resignation: రాజీనామా విషయంలో మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కండిషన్

Prakash Raj to withdraw his resignation from MAA: మా అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మరునాడే అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాను మా అసోసియేషన్ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవడానికి సిద్ధమేనని చెప్పిన ప్రకాశ్ రాజ్.. అందుకోసం మంచు విష్ణుకు ఓ షరతు విధించాడు. 

మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. అసోసియేషన్ రూల్స్ మార్చకుండా ఉంటానంటే తాను మా అసోసియేషన్‌లో కొనసాగుతాను అని ప్రకాశ్ రాజ్ స్పష్టంచేశాడు. మరీ ముఖ్యంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా స్థానికేతరులకు కూడా మా అధ్యక్ష ఎన్నికల్లో (MAA elections) పోటీ చేసే అవకాశం కల్పించిన పాత నిబంధనను మార్చకుండా ఉండాలని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) డిమాండ్ చేశాడు.

మా అసోసియేషన్‌కి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, ఆలోచించాల్సిందిగా మంచు విష్ణు చేసిన అప్పీలుకు (Manchu Vishnu's appeal to Prakash Raj) ప్రతిస్పందనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Also read : Samantha, Naga Chaitanya divorce: సమంత, నాగ చైతన్య అప్పటివరకు భార్యాభర్తలే

ప్రకాశ్ రాజ్ విధించిన ఈ షరతుపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడనేదే ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మంచు విష్ణు అందుకు సరేనని అంగీకరిస్తే... ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచి రాజీనామా చేసిన నటీనటులు కూడా తమ రాజీనామాలు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్టు ఫిలింనగర్ టాక్. ఇదిలావుంటే, మా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు (Manchu Vishnu takes charge as MAA president) ఇవాళ బాధ్యతలు స్వీకరించాడు.

Also read : MAA election officer : బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లలేదు : మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్

Also read : MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News