MAA election officer : బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లలేదు : మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్

krishna mohan responds on ballot controversy: మా ఎన్నికల్లో (MAA Elections) మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. బ్యాలెట్‌ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 09:57 AM IST
  • బ్యాలెట్‌ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు ఆరోపణ
  • మా ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారంటూ వ్యాఖ్యలు
  • బ్యాలెట్‌ పేపర్లను తీసుకెళ్లినట్లు వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్న కృష్ణమోహన్
MAA election officer : బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లలేదు : మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్

MAA election officer krishna mohan responds on prakash raj panel comments and poster ballot controversy: బ్యాలెట్‌ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం‍పై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ( krishna mohan) స్పందించారు.మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసినా కూడా ఇప్పటికీ అదే అంశంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. ఎన్నికలు పూర్తయినా.. ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ (prakash raj panel) మీడియా ఎదుట పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్యానెల్‌ సభ్యులు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అందులో భాగంగా మా ఎన్నికల్లో (MAA Elections) మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. బ్యాలెట్‌ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు ఆరోపించారు. ఎవరో బ్యాలెట్ పేపర్స్ (Ballot papers) ఇంటికి తీసుకెళ్లారట.. బయట టాక్ అంటూ యాంకర్ అనసూయ (anchor anasuya) ట్వీట్ చేయడమే కాక, మీడియా ఎదుట కూడా ఈ ప్రశ్నను అడిగింది. అలాగే ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లోని కొందరు సభ్యులు కూడా ప్రెస్‌ మీట్‌లో ఈ విషయాన్ని లేవనెత్తారు.

Also Read: Banerjee comments : మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారంటూ కంటతడి పెట్టుకున్న బెనర్జీ

తాజాగా ఈ విషయం‍పై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ (krishna mohan) స్పందించారు. యాంకర్‌ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే దానిలో వాస్తవం లేదన్నారు. అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా వచ్చాయో తెలియదన్నారు. ఇక తాను బ్యాలెట్‌ పేపర్లను తీసుకెళ్లినట్లు వస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని కృష్ణమోహన్ చెప్పారు. తాను కేవలం బ్యాలెట్‌ పేపర్ల బాక్సుల తాళాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్‌ పేపర్లు (Ballot papers) అసలు తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. ఇక రాజీనామాల (resignations) విషయం వారి వ్యక్తిగతమని ఈ విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. ఈ విషయంలో మా ప్రెసిడెంట్‌ మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Srikanth resigns: పదవులు లేకపోయినా మంచు విష్ణుకు అండగా ఉంటాం: శ్రీకాంత్

Trending News