HanuMan: అయోధ్యకి మాత్రమే కాదు..భద్రాచలంకి సైతం హనుమాన్ విరాళం…

HanuMan Collections: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన మొదటి చిత్రం హనుమాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 250 కోట్లు కలెక్షన్స్ దాటి ఇంకా కూడా దూసుకుపోతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 07:03 PM IST
HanuMan: అయోధ్యకి మాత్రమే కాదు..భద్రాచలంకి సైతం హనుమాన్ విరాళం…

HanuMan Donations: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం హనుమాన్. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం 250 కోట్ల కలెక్షన్స్ దాటేసింది ఈ సినిమా. తాజాగా ఈ చిత్రం సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా దర్శకుడు మొదలు పెట్టేశారు.

ఈ సినిమా విడుదల కాకముందే ఈ చిత్రానికి ప్రేక్షకులు కొనే ప్రతి టికెట్ నుంచి ఐదు రూపాయలు అయోధ్యకు విరాళం ఇస్తామంటూ ప్రకటించారు సినిమా యూనిట్. కాగా ఇప్పుడు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా ద్వారా కలెక్ట్ అయినా ఐదు కోట్ల అయోధ్య రామ మందిరానికి విరాళం అందజేశారు. అయితే  కేవలం అయోధ్య గుడికి మాత్రమే కాకుండా భద్రాచలంతో పాటు మరికొన్ని రామమందిరాలకు కూడా విరాళాలు అందించబోతున్నారట. ఇదే విషయాన్ని తెలియజేశారు ఈ సినిమా మేకర్స్.

నిన్న జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో ఈ చిత్రం నిర్మాత నిరంజన్ రెడ్డితో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘మనం ఇంత మొత్తాన్ని అయోధ్య రాముడి ఆలయానికి మాత్రమే ఇస్తున్నాము. మనకి భద్రాచలం వంటి రామ మందిరాలు కూడా ఉన్నాయి కదా’ అని ప్రశ్నించగా, నిరంజన్ రెడ్డి బదులిస్తూ.. ‘’భద్రాచలంతో పాటు మన రాష్ట్రాల్లోని మరికొన్ని రామమందిరాలకు కూడా విరాళాలు ఇద్దాం’ అని మాట ఇచ్చారట. మరో విషయం ఏమిటి అంటే, ఈ సినిమా మీద వచ్చిన డబ్బుని ఏ ఇతర బిజినెస్‌ల్లో పెట్టకుండా.. మళ్ళీ సినిమాలు, టెంపుల్స్ కోసం ఉపయోగిస్తానని నిర్మాత తెలియజేశారట.

 

కాగా తేజ హీరోగా చేసిన ఈ చిత్రంలో  వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ ముఖ్యపాత్రలో కనిపించారు. ఈ సినిమా తెలుగు భాషలో మంచి విజయం సాధించింది. ముఖ్యంగా హిందీలో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోండి. 
అలానే ఓవర్ సీస్ మార్కెట్ లో ఈ చిత్రం స్టార్ హీరోల రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు గుంటూరు కారం సైతం హనుమాన్ అంత కలెక్షన్స్ యూఎస్ లో సాధించలేకపోయింది. మొత్తం పైన సంక్రాంతి సినిమాలలోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిన్న బడ్జెట్ సినిమా.

Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు

Also Read:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News