Prabhas's Salar: ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో మరో స్టార్ హీరో.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Prithviraj Sukumaran in Prabhas's Salar: ప్రభాస్ సలార్ సినిమాలో నటించే విషయం మీద హీరో పృధ్వీ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తను డేట్స్ ఇష్యూ క్లియర్ చేసుకుని సినిమాలో భాగామవుతున్నానని పేర్కొన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 05:15 PM IST
  • ప్రభాస్ సలార్ సినిమాలో పృధ్వీ రాజ్
  • డేట్స్ విషయం మీద ప్రశాంత్ ను కలవనున్న పృధ్వీ రాజ్
  • ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫాస్స్
Prabhas's Salar: ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో మరో స్టార్ హీరో.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Prithviraj Sukumaran in salar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న 'సలార్' మీద భారీ అంచనాలు ఉన్నాయి. 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రూపొందించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. చాలా రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. ఈ మొదటి షెడ్యూల్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ కూడా షూట్ చేశారు. తరువాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్‌లో ప్రభాస్‌ మీద కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు. 

ఇక 'సలార్'లో ప్రభాస్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా నటించబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని పృథ్వీరాజ్ స్వయంగా వెల్లడించి,  అనివార్య కారణాల వల్ల తాను నటించడం లేదని కూడా పేర్కొన్నాడు.  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా ‘కడువా’ అనే సినిమా జూన్ 30న విడుదల కానుంది. 

ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా ప్లాన్ చేసింది. సౌత్‌లోని నాలుగు సిటీల‌లో ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి బృందం ప‌య‌న‌మైం,  ఇప్ప‌టికే బెంగ‌ళూర్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హించగా.. శ‌నివారం హైద‌రాబాద్‌లో అవాస హోట‌ల్‌లో కూడా ప్రెస్ ను కలిసింది. అయితే బెంగళూరు ప్రెస్ మీట్లో 'సలార్' మూవీలో నటిస్తున్నానని వెల్లడించారు. గతంలో సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సలార్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశానని అన్నారు.

 ప్రభాస్,  ప్రశాంత్ స్వయంగా అడిగినా కాదన్నానని ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను మళ్లీ ఈ సినిమాలో భాగం అవ్వాలని ప్రశాంత్‌కు చెప్పగా మళ్ళీ సినిమాలో భాగంయ్యనని వెల్లడించారు. ఇక హైదరాబాద్లో ప్రశాంత్ నీల్ ను ఆయన కలవనున్నారని,  డేట్స్ మీద ఒక క్లారిటీ ఈ మీటింగ్లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సలార్ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.  శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.  

Also Read: భారీగా త‌గ్గిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' టిక్కెట్ రేట్లు.. అభిమానులకు పండగే! ముఖ్య అతిథిగా చిరంజీవి

Also Read:SP Charan-Sonia Agarwal: హీరోయిన్తో ఫోటో వైరల్‌.. పెళ్లి వార్తలు రావడంతో షాకిచ్చిన సింగర్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News